Lady Constable: చిత్తూరు జిల్లాలో చెట్టుకు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్న లేడీ కానిస్టేబుల్

|

Aug 08, 2021 | 6:55 PM

చిత్తూరు జిల్లాలో ఓ మహిళా కానిస్టేబుల్‌ సూసైడ్‌ చేసుకుంది. పెనుమూరు మండలం కార్తికేయపురంలో చెట్టుకు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. తిరుమల టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా

Lady Constable: చిత్తూరు జిల్లాలో చెట్టుకు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్న లేడీ కానిస్టేబుల్
Lady Constable Suicide
Follow us on

Lady Constable suicide: చిత్తూరు జిల్లాలో ఓ మహిళా కానిస్టేబుల్‌ సూసైడ్‌ చేసుకుంది. పెనుమూరు మండలం కార్తికేయపురంలో చెట్టుకు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. తిరుమల టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తోన్న సుకన్య ఈ తీవ్ర నిర్ణయానికి పాల్పడింది. కానిస్టేబుల్ సుకన్య భర్త తిరుపతి స్విమ్స్‌లో పనిచేస్తున్నారు. సుకన్యకు రెండు నెలల పాప ఉంది.

మెటర్నిటీ లీవ్‌లో ఉన్న ఆమె.. ఎందుకు ఆత్మహత్య చేసుకుందో మిస్టరీగా మారింది. అనుమానాస్పద మ‌‌ృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే, తమ ఫ్యామిలీలో ఎలాంటి తగాదాలు లేవని, తన భార్య ఎందుకు ఇంతటి దారుణానికి ఒడిగట్టిందో అర్థం కావడంలేదని భర్త చెబుతున్నాడు.

కాగా, చిత్తూరు సమీపంలోని చౌటూరుకు చెందిన సుకన్యకు పెనుమూరు మండలం కార్తికేయపురంకు చెందిన ప్రసాద్‌తో 5 ఏళ్ల క్రితం ప్రేమ చిగురించి.. ఆపై పెద్దలు సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. 3 ఏళ్ల క్రితం మొదటి సంతానం ఆడబిడ్డ కాగా, 2 నెలల క్రితం మరో ఆడబిడ్డకు జన్మ నిచ్చింది సుకన్య. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకునేందుకు భర్త, అత్త అంగీకరించక పోవడంతో సుకన్య మనస్తాపం చెందినట్టు తెలుస్తోంది.

మెటర్నటీ సెలవులో ఉన్న సుకన్యకు, అత్తారింటి వారితో 2 నెలలుగా ఈ వ్యవహారంపై గొడవలు జరుగుతున్నట్టు సమాచారం. మెట్టినింటి వాళ్లు వారసుడు కావాలని ఒత్తిడి చేస్తుండటంతో.. మగ సంతానం కోసం కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కు అంగీకరించక పోవడంతో సుకన్య ఆత్మహత్యకు పాల్పడిందని బంధువులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే సుకన్య ఆత్మహత్య చేసుకుందని కానిస్టేబుల్‌ బంధువులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

అనుమానంతో.. భార్యపై కత్తితో దాడి

అనంతపురం జిల్లాలో భార్యపై అనుమానాన్ని పెంచుకున్న ఓ భర్త కత్తితో దారుణంగా దాడి చేశాడు. పెళ్లి అయిన కొన్నేళ్ల తరువాత పర పురుషులతో మాట్లాడనంటూ తనకు హామీ పత్రం రాసివ్వాలని కట్టుకున్న భార్యపై ఒత్తిడి చేశాడు. ఇందుకు ఆమె నిరాకరించడంతో కత్తితో దారుణంగా దాడి చేశాడు. ఈ ఘటన జిల్లాలోని గుంతకల్లు పట్టణం ఆంథోని కాలనీలో శనివారం చోటుచేసుకుంది. అనంతరం బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంతకల్లుకు చెందిన రజాక్‌కు అనంతపురానికి చెందిన షర్మిలతో 15 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు.

అయితే.. ఈ దంపతులిద్దరూ కూరగాయల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. భార్య ఇతర పురుషులతో మాట్లాడుతోందని భర్త రజాక్ అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో నాలుగు నెలల క్రితం ఆమెను కొట్టడంతో పుట్టింటికి వెళ్లిపోయింది. అనంతరం ఇటీవల మూడు రోజుల కింద భార్య తిరిగి ఇంటికి రాగా గొడవ పెట్టుకున్నాడు. ఇక నుంచి ఇతర పురుషులతో మాట్లాడనంటూ తనకు రాతపూర్వకంగా రాసి ఇస్తేనే ఇంట్లో ఉండాలని.. అలా తనకు హామీ ఇవ్వాలని రజాక్ షర్మిలపై ఒత్తిడి చేశాడు. అయితే.. భర్త షరతులకు ఆమె అంగీకరించక పోవడంతో ఇంట్లో ఉన్న కత్తితో దారుణంగా దాడి చేశాడు.

ఈ ఘటనలో బాధితురాలు తీవ్రంగా గాయపడింది. గమనించిన కుటుంబసభ్యులు ఆమెను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురం తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వన్ టౌన్ పోలీసులు వెల్లడించారు.

Read also: Komatireddy: ఎమ్మెల్యే, ఎంపీ పదవులకు ఇప్పుడే రిజైన్ చేస్తాం.. వచ్చే ఎన్నికల్లో పోటీ కూడా చేయం. కావాలంటే బాండ్ రాసిస్తాం: కోమటిరెడ్డి