Tirupati: సెల్‌ఫోన్ చూడొద్దంటూ మందలించిన తల్లి.. కూతురు ఏం చేసిందంటే..?

|

Mar 06, 2022 | 10:57 AM

Tirupati Inter student: క్షణికావేశంలో కొంతమంది దారుణ నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా.. సెల్‌ఫోన్ వాడొద్దంటూ తల్లి మందలించడంతో ఇంటర్ విద్యార్థిని

Tirupati: సెల్‌ఫోన్ చూడొద్దంటూ మందలించిన తల్లి.. కూతురు ఏం చేసిందంటే..?
Mobile
Follow us on

Tirupati Inter student: క్షణికావేశంలో కొంతమంది దారుణ నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా.. సెల్‌ఫోన్ వాడొద్దంటూ తల్లి మందలించడంతో ఇంటర్ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన శనివారం చిత్తూరు జిల్లాలోని తిరుపతి పట్టణంలో చోటుచేసుకుంది. తిరుపతి ఈస్ట్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుమలలో కుంకుమ వ్యాపారం చేసుకుని జీవనం సాగిస్తున్న బాలాజీ తన కుటుంబంతో కలిసి కొర్లగుంట ప్రాంతంలోని మారుతి నగర్‌లో నివాసం ఉంటున్నాడు. బాలాజీ కుమార్తె వాణిశ్రీ (16) నగరంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి చాలాసేపటి నుంచి వాణిశ్రీ తన వద్ద ఉన్న సెల్‌ఫోన్‌ చూస్తూ కనిపించింది. దీంతో సెల్‌ఫోన్ చూస్తూ.. చదువుపై శ్రద్ధ పెట్టడం లేదంటూ ఆమెను తల్లి మందలించింది. ఆ తర్వాత వాణిశ్రీ సెల్‌ఫోన్ (Mobile) ఆపి పడుకుంటానని చెప్పింది. అనంతరం ఇంటిపైన ఉన్న గదిలోకి వెళ్లింది.

తల్లి మందలించడంతో మనస్తాపానికి గురైన వాణిశ్రీ డాబాపై ఉన్న గదిలోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కొంతసేపటి తర్వాత వాణిశ్రీని చూసిన కుటుంబసభ్యులు.. ఆందోళన చెందారు. వెంటనే ఆమెను రుయా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. సమాచారం అందుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఎస్వీ మెడికల్‌ కళాశాలకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తిరుపతి పోలీసులు తెలిపారు.

Also Read:

Hyderabad: స్కూల్‌కు వెళ్లి మళ్లీ తిరిగిరాలేదు.. నగరంలో ఇద్దరు బాలికల అదృశ్యం.. అసలేం జరిగింది?

Hyderabad: స్పా సెంటర్ల పేరిట చీకటి వ్యాపారం.. ఆరుగురు యువతులను రక్షించిన పోలీసులు