
Indian Railways: రైల్వే ప్రయాణీకులకు తీపి కబురు. ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే మరిన్ని ప్రత్యేక రైళ్లను నడపనుంది. తిరుపతి – అకోలా మధ్య మరో 14 వీక్లీ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ట్విట్టర్ ద్వారా తెలిపింది. ప్రత్యేక రైలు (నెం.07605) తిరుపతి నుంచి నవంబరు 19, 26 తేదీలు, డిసెంబరు 03, 10, 17, 24, 31 తేదీల్లో మధ్యాహ్నం 12.30 గంటలకు అకోలాకు బయలుదేరుతుంది. ఈ ప్రత్యేక రైలు మరుసటి రోజు మధ్యాహ్నం 12.15 గం.లకు మహారాష్ట్రలోని అకోలా రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది.
అలాగే ప్రత్యేక రైలు (నెం. 07606) నవంబరు 21, 28, డిసెంబరు 5,12, 19, 26, జనవరి 02 తేదీల్లో ఉదయం 08.20 గం.లకు అకోలా నుంచి బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 06.25 గం.లకు తిరుపతి రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది.
దక్షిణ మధ్య రైల్వే ట్వీట్..
#specialtrains between #Tirupati – #Akola @drmgtl @drmned pic.twitter.com/X7sfkAD4eY
— South Central Railway (@SCRailwayIndia) November 3, 2021
ఈ ప్రత్యేక రైళ్లు పాకాల, పీలేరు, మదనపల్లి రోడ్, కదిరి, ధర్మవరం, అనంతపూర్, ఢోన్, కర్నూల్ సిటీ, గద్వాల్, మహబూబ్ నగర్, కాచిగూడ, కామారెడ్డి, నిజామాబాద్, ధర్మాబాద్, ముద్ఖేడ్, నాందేడ్, పూర్ణ, బాస్మత్, హింగోలి, వాశీం స్టేషన్లలో ఆగుతాయి. ఈ ప్రత్యేక రైళ్లలో ఏసీ 3 టైర్, స్లీపర్ క్లాస్, సెకండ్ సీటింగ్ కోచ్‌లు ఉంటాయి. పూర్తి రిజర్వేషన్లతో ఈ ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. వీటిలో ప్రయాణించేందుకు అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. నేరుగా బుకింగ్ కేంద్రాలు లేదా IRCTC పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో టికెట్లను రిజర్వేషన్ చేసుకోవచ్చు.
రైల్వే శాఖ నడుపుతున్న మరిన్ని ప్రత్యేక రైళ్లకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రయాణీకులు enquiry.indianrail.gov.in వెబ్‌సైట్‌లో లాగిన్ చేసి తెలుసుకోవచ్చు.
Also Read..
Andhra Pradesh: అయ్యో పాపం యాక్సిడెంట్ అనుకోకండి.. అసలు విషయం తెలిస్తే మైండ్ బ్లాంక్