Tirumala: తిరుమలకు వెళ్లేవారికి రైల్వేశాఖ భారీ శుభవార్త.. మరికొన్ని ప్రత్యేక రైళ్లు వచ్చేశాయి.. టైమింగ్స్ ఇవే..

తిరుమల వెళ్లే భక్తులకు సూపర్ న్యూస్. రైల్వేశాఖ మరో శుభవార్త అందించింది. మరో ప్రత్యేక వీక్లీ రైలును అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఈ రైలు షెడ్యూల్ వివరాలను కూడా ప్రకటించింది. ఈ ట్రైన్ టైమింగ్స్ ఏంటి.. ఏయే రోజుల్లో సర్వీసులు అందించనుందనే వివరాలు ఇలా..

Tirumala: తిరుమలకు వెళ్లేవారికి రైల్వేశాఖ భారీ శుభవార్త.. మరికొన్ని ప్రత్యేక రైళ్లు వచ్చేశాయి.. టైమింగ్స్ ఇవే..
Tirumala

Updated on: Aug 13, 2026 | 10:06 AM

తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు రైల్వేశాఖ శుభవార్త అందించింది. శ్రీవారిని దర్శించుకునేందుకు దేశ, విదేశాల నుంచి లక్షలాది మంది తరచూ వస్తూ ఉంటారు. దీంతో తిరుపతి రైల్వే మార్గంలో ట్రైన్లలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను ఈ రూట్లో ఎప్పటికప్పుడు నడుపుతోంది. ప్రయాణికులకు అందుబాటులో ఉంచేలా స్పెషల్ రైళ్లు, వీక్లీ రైళ్లను ప్రవేశపెడుతోంది. ఇక సెలవులు, పండుగ రోజుల్లో మరిన్ని రైళ్లను తీసుకొస్తుంది. ప్రయాణికుల అవసరాలను తీర్చేందుకు ఈ ప్రత్యేక రైళ్లను ఎప్పటికప్పుడు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు రైల్వేశాఖ చెబుతోంది.

వీక్లీ స్పెషల్ రైలు

ఇక తిరుమల వెళ్లే ప్రయాణికులకు మరో వీకెండ్ స్పెషల్ ట్రైన్ అందుబాటులోకి వచ్చింది. తిరుపతి-విశాఖపట్నం వీక్లీ ఎక్స్‌ప్రెస్(08509) తీసుకొచ్చింది. ఆగస్ట్ 10వ తేదీ నుంచి సెప్టెంబర్ 10 వరకు నెల రోజుల వరకు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు షెడ్యూల్ విషయానికొస్తే.. ప్రతీ ఆదివారం, గురువారం తిరుపతిలో ఉదయం 9.50 గంటలకు బయల్దేరి.. తర్వాతి రోజు ఉదయం 6.30 గంటలకు విశాఖకు చేరుకుంటుంది. ఇక ఇదే రైలు విశాఖపట్నం-తిరుపతి(08510) ఆగస్ట్ 17 నుంచి సెప్టెంబర్ 11 వరకు సర్వీసులు అందించనుంది. ప్రతీ సోమ, శుక్రవారాల్లో విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో రాత్రి 7.40 గంటలకు బయల్దేరి తర్వాతి రోజు సాయంత్రం 6.45 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. ఈ ట్రైన్‌లో 22 కోచ్‌లు అందుబాటులో ఉంటాయి. ఏపీలోని పలు ప్రాంతాల నుంచి తిరుపతి వెళ్లే ప్రయాణికులకు ఈ రైళ్లు ఉపయోగపడతాయని, ప్రయాణికులు ఈ అవకాాశాన్ని ఉపయోగించుకోవాలని రైల్వేశాఖ తెలిపింది. ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉన్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

ఆగస్ట్ 26 నుంచి స్పెషల్ ట్రైన్లు

ఇక సంబల్‌పూర్- చర్లపల్లి(08309) ప్రత్యేక రైలు ఆగస్ట్ 14న ఉదయం 11.45 గంటలకు బయల్దేరి.. ఈ నెల 15వ తేదీ ఉదయం 11.30 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది. ఈ ట్రైనులో మొత్తం 20 కోచ్‌లు అందుబాటులో ఉంటాయి. అటు తమిళనాడులో ఆగస్ట్ 29 నుంచి సెప్టెంబర్ 8 వరకు బసిలికా ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ గుడ్ హెల్త్ చర్చి వార్షిక ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భక్తులు భారీగా పాల్గొననున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే స్పెషల్ రైళ్లను ప్రవేశపెడుతోంది. ఆగస్ట్ 26 నుంచి సెప్టెంబర్ 7 వరకు ఈ రైళ్లు నడుస్తాయి. ఈ రైళ్లు ఏపీ, తెలంగాణలోని పలు స్టేషన్లలో ఆగుతాయి.  నల్లగొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు మీదుగా ఇవి వెళ్లనున్నాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us