Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు అద్భుత అవకాశం.. దశాబ్దాల తర్వాత ఇదే తొలిసారి.. ఛాన్స్ మిస్ అవ్వొద్దు..

తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్. తిరుమల శ్రీవారి వస్త్రాలను మీరు ఆన్‌లైన్‌లో పొందవచ్చు. ఈ మేరకు టీటీడీ ఆన్ లైన్‌లో వేలం నిర్వహిస్తోంది. దీని ద్వారా భక్తులు వస్త్రాలను పొందవచ్చు. మార్చి 2వ తేదీ నుంచి ఇది ప్రారంభం కానుంది.

Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు అద్భుత అవకాశం.. దశాబ్దాల తర్వాత ఇదే తొలిసారి.. ఛాన్స్ మిస్ అవ్వొద్దు..
Tirumala

Updated on: Feb 25, 2026 | 9:16 PM

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త అందించింది టీటీడీ. తిరుమలతో పాటు టీటీడీ అనుబంధ ఆలయాల్లో స్వామివారికి భక్తులు కానుకగా సమర్పించిన వస్త్రాలను ఈ-వేలంలో విక్రయించనుంది. ఈ మేరకు ఆన్‌లైన్ ద్వారా వేలం నిర్వహించనుంది. ఈ వేలంలో భక్తులు తిరుమల శ్రీవారి వస్త్రాలను సంపాదించుకోవచ్చు. ఇక కొత్త వాటితో పాటు ఉపయోగించినవి, పాక్షికంగా దెబ్బతిన్న వస్త్రాలను కూడా ఈ వేలంలో ఉంచనుంది. హాఫ్ సారీస్, సిల్క్, ఆర్డినరీ, ఆర్ట్ సిల్క్ చీరలకు ఆన్‌లైన్‌లో వేలం నిర్వహించనున్నామని, భక్తులో పాల్గొని శ్రీవారి వస్త్రాలను సొంతం చేసుకోవచ్చని టీటీడీ తెలిపింది. మార్చి 2వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఈ వేలం నిర్వహించనున్నట్లు టీటీడీ స్పష్టం చేసింది. మొత్తం వారం రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది.

ఎలా పాల్గొనాలంటే..?

ఏపీ ప్రభుత్వం ఈ-కొనుగోలు పోర్టల్‌లో రిజిస్టర్ అవ్వాలి. దాని ద్వారా ఈ వేలంలో పాల్గొనవచ్చు. ఇక అనుమానాల కోసం టీటీడీ వెబ్ సైట్ www.tirumala.org లేదా 0877-2264429 / 9959988470 నెంబర్లను సంప్రదించాలని అధికారులు సూచించారు. ఎన్నో ఏళ్లుగా టీటీడీలో స్క్రాప్ పేరుకుపోయింది. దీనిని తొలగించడంపై టీడీడీ దృష్టి పెట్టింది. 15 రోజుల్లో స్క్రాప్ గురించి సమాచారం అందించాలని అన్ని డిపార్ట్‌మెంట్ అధికారులను టీటీడీ ఆదేశించింది. ఈ నివేదిక వచ్చిన ద్వారా వాటికి ఆన్ లైన్ వేలం నిర్వహించేందుకు టీటీడీ కసరత్తు చేస్తోంది. స్క్రాప్ మొత్తాన్ని విక్రయించేలా టీటీడీ సిద్దమవుతోంది. ఎన్నో ఏళ్లుగా పేరుకుపోయిన స్క్రాప్‌ను క్లియర్ చేసే చర్యలు టీటీడీ చేపట్టింది. తాజాగా టీటీడీ ఏఈవో వెంకయ్య చౌదరి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్‌లో 15 రోజులుగా స్క్రాప్‌కి సంబంధించిన సమాచారం అందించాలని ఆదేశాలు జారీ చేశారు.

అభిప్రాయ సేకరణ

అటు టీటీడీ భక్తుల నుంచి అభిప్రాయ సేకరణ చేపడుతోంది. టీటీడీ అందిస్తున్న సేవలు, రావాణా సౌకర్యాలు, అన్న ప్రసాదం, పారిశుద్ద్య సేవలపై భక్తుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటుంది. దీనికి భక్తుల నుంచి అద్భుత స్పందన వస్తోంది. ఈ ఫీడ్ బ్యాక్ ఆధారంగా సేవలను మెరుగుపర్చేందుకు టీటీడీ ప్రయత్నిస్తోంది. అభిప్రాయ సేకరణ తర్వాత తిరుమలలో సేవలు మరింత మెరుగైనట్లు టీటీడీ ఏఈవో వెంకయ్య చౌదరి స్పష్టం చేశారు. భక్తుల నుంచి ఎప్పటికప్పుడు అభిప్రాయ సేకరణ చేపడుతున్నట్లు స్పష్టం చేశారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.

Follow Us