Tirumala: తిరుపతి చేరుకున్న సీఎం కాన్వాయ్ బాధితులు.. మెట్ల పూజ రద్దు చేసుకున్నామని ఆవేదన

|

Apr 21, 2022 | 1:24 PM

Tirumala: ఒంగోలులో(Ongole) సీఎం జగన్ (CM jagan) పర్యటన నేపథ్యంలో కాన్వాయ్ కు కావాలంటూ ఇన్నోవాలో తిరుపతి వెళ్తున్న భక్తుల నుంచి ఆ కారుని అధికారులు లాక్కున్నారు. అర్ధరాత్రి హంగామా ..

Tirumala: తిరుపతి చేరుకున్న సీఎం కాన్వాయ్ బాధితులు.. మెట్ల పూజ రద్దు చేసుకున్నామని ఆవేదన
Onglore Tirumala Devotees
Follow us on

Tirumala: ఒంగోలులో(Ongole) సీఎం జగన్ (CM jagan) పర్యటన నేపథ్యంలో కాన్వాయ్ కు కావాలంటూ ఇన్నోవాలో తిరుపతి వెళ్తున్న భక్తుల నుంచి ఆ కారుని అధికారులు లాక్కున్నారు. అర్ధరాత్రి హంగామా సృష్టించిన సంగతి తెలిసిందే. దీంతో బాధితులు వేరే కారుని అద్దెకు తీసుకుని  తిరుమల తిరుపతి క్షేత్రానికి చేరుకున్నారు. ఈ నేపధ్యంలో సీఎం కాన్వాయ్ బాధితులు స్పందిస్తూ.. తాము పోలీసుల వ్యవహార శైలి వలన తీవ్ర ఇబ్బంది పడ్డామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తాము శ్రీవారి దర్శనానికి అద్దె కారులో వెళ్తూ వుంటే పోలీసులు ఒంగోలులో కారు అడ్డుకుని స్వాధీనం చేసుకున్నారని బాధితుల్లో ఒకరైన శ్రీనివాసులు చెప్పారు. తమ కారుని  సీఎం పర్యటన పేరుతో  దౌర్జన్యంగా స్వాధీనం చేసుకున్నారని మండిపడ్డారు. రాత్రి సమయం కావడంతో భధ్రత కోసం ఆర్టీసీ డిపోలో తలదాచుకున్నామని బాధిత సభ్యులు చెప్పారు. అనంతరం మరో వాహనము అద్దెకు తీసుకుని చివరకు తిరుమల చేరుకున్నామని.. అయితే తాము అనుకున్న సమయానికి .. తిరుమల క్షేత్రానికి చేరుకోలేక పోయామని పోలీసులు వ్యవహరశైలి కారణంగా మెట్ల పూజ కూడా రద్దు చేసుకున్నామంటూ బాధితుడు శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు.

 

Andhra Pradesh: సీఎం కాన్వాయ్ కోసం కారు స్వాధీనంపై సీఎంవో సీరియస్.. వారిపై సస్పెన్షన్ వేటు

EX Minister Shankar Narayana: మాజీ మంత్రి అయినా మారని శంకర్ నారాయణ లైఫ్ స్టైల్..