Chittoor: పుంగనూరు ఘటనలో 62 మంది అరెస్టు.. విచారణలో కీలక విషయాల వెల్లడి..

|

Aug 07, 2023 | 10:13 AM

Chittoor Dristrict: చంద్రబాబు పుంగనూరు పర్యటన సమయంలో భీమగానిపల్లెలో జరిగిన దాడులపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఆదివారం 62 మందిని అరెస్టు చేశామని తెలిపారు. స్థానిక ఎస్‌ఈబీ ఏఎస్పీ శ్రీలక్ష్మి మాట్లాడుతూ.. ‘చంద్రబాబు పర్యటన సందర్భంగా ఆయన్ను బైపాస్‌ మార్గంలో కాకుండా ఎలా అయినా పట్టణంలోకి తీసుకురావాలని వ్యూహం రచించారు పుంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి చల్లా బాబు. ఈ క్రమంలోనే టీడీపీ కార్యకర్తలు, వారిని అడ్డుకున్న పోలీసులతో వాదనకు దిగారు. పోలీసులకు చెందిన వజ్ర, ఈచర్‌ వాహనాలను..

Chittoor: పుంగనూరు ఘటనలో 62 మంది అరెస్టు.. విచారణలో కీలక విషయాల వెల్లడి..
Accused 62 People
Follow us on

పుంగనూరు, ఆగస్టు 7: చిత్తూరు పుంగనూరు సమీపంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన సమయంలో జరిగిన దాడులు జరిగిన సంగతి తెలిసిందే. భీమగానిపల్లెలో జరిగిన ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఆదివారం 62 మందిని అరెస్టు చేశామని తెలిపారు. స్థానిక ఎస్‌ఈబీ ఏఎస్పీ శ్రీలక్ష్మి మాట్లాడుతూ.. ‘చంద్రబాబు పర్యటన సందర్భంగా ఆయన్ను బైపాస్‌ మార్గంలో కాకుండా ఎలా అయినా పట్టణంలోకి తీసుకురావాలని వ్యూహం రచించారు పుంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి చల్లా బాబు. ఈ క్రమంలోనే టీడీపీ కార్యకర్తలు, వారిని అడ్డుకున్న పోలీసులతో వాదనకు దిగారు. పోలీసులకు చెందిన వజ్ర, ఈచర్‌ వాహనాలను ధ్వంసం చేయడంతో పాటు వాటికి నిప్పు పెట్టారు. ఈ సంఘటనపై పుంగనూరు పోలీసుస్టేషన్‌లో కేసులు నమోదు చేశాం. చల్లా బాబు అనుచరుడు గోవర్ధన్‌రెడ్డి, మరో 61 మందిని ఆదివారం అరెస్టు చేశామ’ని ఆమె తెలిపారు.

అలాగే ‘పోలీసుల విచారణలో గోవర్ధన్‌రెడ్డి.. ఈనెల 2న రొంపిచెర్లలో కార్యకర్తలతో జరిగిన సమావేశంలో పోలీసులను చంపేసి అయినా చంద్రబాబును పుంగనూరు పట్టణంలోకి తీసుకు రావాలని చల్లా బాబు చెప్పారని వెల్లడించారు. గొడవ జరిగితే బందోబస్తుగా వచ్చిన పోలీసులు కాల్పులు జరుపుతారని, అందులో ఎవరైనా మరణిస్తే చల్లా బాబు పేరు రాష్ట్రం మొత్తం ప్రచారంలోకి వస్తుందని విచారణలో తెలిపారు. అన్ని కేసుల్లో చల్లా బాబునే మొదటి నిందితుడిగా చేర్చాం. మరి కొందరిని ఇంకా అరెస్టు చేయాల్సి ఉంది. ఈ సంఘటనపై పుంగనూరు పోలీసు స్టేషన్‌లో మొత్తం ఐదు కేసులు నమోదు అయ్యాయి. దాదాపు 160 మందిని ఇప్పటికే నిందితులుగా చేర్చాం. అన్నింటిలోనూ హత్యా యత్నానికి సంబంధించిన 307 సెక్షన్‌ పెట్టార’ ఏఎస్పీ శ్రీలక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా అన్నమయ్య జిల్లాకు చెందిన మరి కొందరినీగుర్తించిన పోలీసులు వారి ఫొటోలు, వివరాలను స్థానికంగా ఉన్న ఆయా స్టేషన్లకు పంపించారు.

కాగా, చంద్రబాబు పర్యటన సమయంలో.. పోలీసులపైనే కొందరు బీర్ బాటిళ్లు, రాళ్లు, కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడుల్లో 11 మంది పోలీసులకు తీవ్ర గాయాలు, 30 మంది స్వల్ప గాయాలవగా వారికి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో డీఎస్పీ కూడా ఉన్నారని సమాచారం. అయితే తమపై అక్రమంగా కేసులు నమోదు చేశారని, అల్లర్లకు ఏమాత్రం సంబంధం లేని అమాయకులపై కేసులు పెట్టారని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. అక్రమ కేసులు పెట్టి అమాయకులను పోలీసులు వేధిస్తున్నారంటూ బాధితుల కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు విమర్శిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..