Tirupati By Election : తిరుపతి బైపోల్స్ లో చంద్రబాబు సరికొత్త వ్యూహం… ఆ నేతలకు కీలక బాధ్యతలు

|

Mar 19, 2021 | 5:45 PM

Tirupathi By Poll : తిరుపతి ఎంపీ ఉప ఎన్నికపై తెలుగుదేశం పార్టీ పుల్‌ ఫోకస్ పెట్టింది. మున్సిపల్ ఫలితాలతో డీలా పడిన ఆపార్టీ,..

Tirupati By Election : తిరుపతి బైపోల్స్ లో చంద్రబాబు సరికొత్త వ్యూహం...  ఆ నేతలకు కీలక బాధ్యతలు
Chandrababu Panabaka Lakshm
Follow us on

Tirupati By Poll : తిరుపతి ఎంపీ ఉప ఎన్నికపై తెలుగుదేశం పార్టీ పుల్‌ ఫోకస్ పెట్టింది. మున్సిపల్ ఫలితాలతో డీలా పడిన ఆపార్టీ, ఈ ఎన్నికలో ఎలాగైనా గెలవాలని వ్యూహాలు రచిస్తోంది. ఇంటింటి ప్రచారం నిర్వహించాలని, గెలుపే లక్ష్యంగా తెగించి పోరాడాలని నేతలకు చంద్రబాబు ఇప్పటికే పుల్ క్లాస్ పీకేశారు. ఇక, ఈ నెల 24న నామినేషన్ వేసేందుకు టీడీపీ సన్నద్ధం అవుతోంది. అంతేకాదు, ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. అందరికంటే ముందే అభ్యర్థిని ప్రకటించి సన్నాహక సమావేశాలు కూడా షురూ చేసింది.

తిరుపతి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా మాజీ కేంద్రమంత్రి పనబాక లక్ష్మిని ఇప్పటికే ప్రకటించారు చంద్రబాబు. పార్టీ సీనియర్ నేతలతో భేటీ అయి అభిప్రాయాలు కూడా తీసుకున్నారు. తిరుపతి పార్లమెంట్ పరిధిలోకి వచ్చే 7 అసెంబ్లీ నియోజకవర్గల నేతలతో విడి విడిగా భేటీ అయి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, ప్రచారం పై చర్చించారు.

దీనికితోడు, ఐదుగురుతో తిరుపతి ఉప ఎన్నిక కోసం మానిటరింగ్ కమిటీ వేశారు చంద్రబాబు. ఈ కమిటీలో అచ్చెన్నాయుడు, నారా లోకేష్, బీద రవిచంద్ర, పనబాక కృష్ణయ్య, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఉన్నారు. ఈ ఎన్నికలను సీరియస్ గా తీసుకొని ప్రతి ఒక్కరూ తెగించి పోరాడాలని, తెగించి పోరాడేవాళ్లకే పార్టీలో గుర్తింపు ఉంటుందని చంద్రబాబు తేల్చి చెప్పారు. క్షేత్రస్థాయిలో నాయకులు పనిచేయకుండా కబుర్లు చెప్తే కుదరదని, రిజర్వేషన్లు, విధేయతలు, మోహమాటాలు ఇకపై చెల్లవన్నారు.

వైసీపీ వైఫల్యాలపై 10 అంశాలు గుర్తించి ప్రతి ఇంటికి వెళ్లాలని ఇంటింటి ప్రచారం చేయాలని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. ప్రతి నియోజకవర్గాన్ని పది క్లస్టర్లు గా విభజించి, మొత్తం ఏడు నియోజకవర్గ వర్గాలకు 70 క్లస్టర్లు ఏర్పాటు చేశారు. వీటికి సీనియర్ నేతలు, మాజీ మంత్రులు ఇన్ చార్జ్ లుగా బాధ్యతలు ఇచ్చారు. వైసీపీ 22 మంది ఎంపీలు గెలిచినా రాష్ట్ర సమస్యలు, ప్రయోజనాల కోసం పోరాటం చేయడం లేదన్నది బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని డిసైడ్‌ అయ్యారు.

టీడీపీ ని గెలిపిస్తే, ప్రత్యేక హోదా, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం, విభజన హామీల కోసం పోరాటం చేస్తామని.. టీడీపీ నేతలు అంటున్నారు. ఈ నెల 24 న పనబాక లక్ష్మి నామినేషన్ దాఖలు చేసే ముందు నియోజకవర్గాల వారీగా కార్యకర్తలతో సమావేశాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. మొత్తానికి మున్సిపల్ ఫలితాలతో డీలా పడిన టీడీపీకి ఈ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారిపోయింది.

Read also : Breaking News : చంద్రబాబుకి బిగ్‌ రిలీఫ్, అమరావతి ల్యాండ్ స్కాంపై సీఐడీకు విచారణకు స్టే ఇచ్చిన హైకోర్టు