నెల 31వ తేదిన తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం సందర్భంగా స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఇందుకు సంబంధించి 30వ తేది బుధవారం తిరుమలలో సిఫార్సు లేఖలు స్వీకరించబడవని వెల్లడించింది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని సహకరించాలని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.
నవంబరులో తిరుమలలో విశేష పర్వదినాలు ఇవే..
తిరుమలలో నవంబరు నెలలో జరుగనున్న విశేష పర్వదినాల వివరాలు ఇలా ఉన్నాయి.
• నవంబరు 1న కేదారగౌరీ వ్రతం
• నవంబరు 3న భగినీహస్త భోజనం, శ్రీ తిరుమలనంబి శాత్తుమొర
• నవంబరు 5న నాగుల చవితి, పెద్ద శేష వాహనం.
• నవంబరు 6న శ్రీ మనవాళ మహామునుల శాత్తుమొర
• నవంబరు 8న వార్షిక పుష్పయాగానికి అంకురార్పణ
• నవంబరు 9న శ్రీ వారి పుష్పయాగం, అత్రి మహర్షి వర్ష తిరునక్షత్రం, పిళ్లైలోకాచార్య వర్ష తిరు నక్షత్రం, పోయిగైయాళ్వార్ వర్ష తిరు నక్షత్రం, పూదత్తాళ్వార్ వర్ష తిరు నక్షత్రం, వేదాంత దేశికుల శాత్తుమొర
• 10న పేయాళ్వార్ వర్ష తిరు నక్షత్రం
• నవంబరు 11న శ్రీ యాజ్ఞవల్క్య జయంతి
• నవంబరు 12న ప్రబోధన ఏకాదశి
• నవంబరు 13న కైశిక ద్వాదశి ఆస్థానం, చాతుర్మాస్య వ్రత సమాప్తి
• నవంబరు 15న కార్తీక పౌర్ణమి
• 28న ధన్వంతరి జయంతి
• 29న మాస శివరాత్రి
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..