Tirumala: తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్ కంగనా రనౌత్.. సాంప్రదాయ దుస్తుల్లో, బొట్టుతో ఆకట్టుకున్న బాలీవుడ్ క్వీన్

|

May 16, 2022 | 10:00 AM

తిరుమల శ్రీవారిని బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ దర్శించుకున్నారు. తాను తన తాజా సినిమా 'ధాకడ్' హిట్ కావాలని స్వామివారిని కోరుకున్నట్లు ఈ సందర్భంగా కంగనా చెప్పారు, సాంప్రదాయ దుస్తులులో నుదుటిమీద బొట్టుతో ఆకట్టుకున్న కంగనా

Tirumala: తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్ కంగనా రనౌత్.. సాంప్రదాయ దుస్తుల్లో, బొట్టుతో ఆకట్టుకున్న బాలీవుడ్ క్వీన్
Kangana Visits Tirupati
Follow us on

Tirumala: కలియుగదైవం శ్రీవెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల తిరుపతి క్షేత్రాన్ని బాలీవుడ్(Bollywood) హీరయిన్ కంగనా రనౌత్ (Kangana Ranauth) ఈరోజు దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీవారికి తమ మొక్కులను చెల్లించుకున్నారు క్వీన్ కంగనా. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో కంగనాకు వేదపండితులు ఆశీర్వాదం ఇచ్చి.. స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయ అధికారులు కంగనా రనౌత్ కు స్వామివారి శేషవస్త్రంతో సత్కరించారు. సాంప్రదాయ దుస్తులతో కంగనా తిరుమల గిరిపై ఆకట్టుకున్నారు. కంగనాకు చూడడానికి భారీ సంఖ్యలో భక్తులు క్యూలు కట్టారు.

కోనేటిరాయుడి దర్శనానంతరం ఆలయం వెలుపల మాట్లాడుతూ.. తాను ధాకడ్ సినిమా విజయవంతమవ్వాలని శ్రీవారి ఆశీర్వాదం కోసం తిరుమలకు వచ్చినట్లు చెప్పారు. ప్రేక్షకులందరూ ధాకడ్ చిత్రాన్ని ఆదరించాలని కోరుతున్నానని అన్నారు  హీరోయిన్ కంగనా రనౌత్.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి