తిరుపతి ఉపఎన్నికల్లో వైసీపీ రూ. 2 వందల కోట్లు ఓటర్లకు పంచేందుకు సిద్ధంగా ఉంది : బీజేపీ జాతీయ కార్యదర్శి వ్యాఖ్యలు

Tirupati by-election : బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు...

తిరుపతి ఉపఎన్నికల్లో వైసీపీ రూ. 2 వందల కోట్లు ఓటర్లకు పంచేందుకు సిద్ధంగా ఉంది : బీజేపీ జాతీయ కార్యదర్శి వ్యాఖ్యలు
cm-jagan-

Updated on: Apr 09, 2021 | 4:47 PM

Tirupati by-election : బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతి ఉపఎన్నికల్లో వైసీపీ 2 వందల కోట్లు ఓటర్లకు పంచేందుకు సిద్ధంగా ఉందని ఆరోపించారు. బైపోల్‌లో వైసీపీ ధన ప్రవాహాన్ని అడ్డుకుని తీరుతామన్నారు. బీజేపీ, పవన్‌ కళ్యాణ్‌ కలయిక చూసి జగన్‌కి వెన్నులో వణుకు పుడుతోందని సత్యకుమార్‌ విమర్శించారు. ఇలా ఉండగా, తిరుపతి ఉప ఎన్నికల ప్రచారానికి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫైనల్ టచ్ ఇవ్వబోతున్నారు. వైసీపీ అభ్యర్ధి గురుమూర్తి గెలుపు కోసం ఆయన ఈ నెల 14వ తేదీన ప్రచారం చేయబోతున్నారు. ఇదిలా ఉంటే తిరుపతి పార్లమెంట్ సీట్‌ను అత్యధిక మెజారిటీతో విజయం సాధించాలన్న టార్గెట్‌తో పని చేస్తోంది వైసీపీ.. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ మంత్రులు, ఎమ్మెల్యేలు ముమ్మరంగా ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్నికల ప్రచారానికి సీఎం జగన్ ఫైనల్ టచ్ ఇస్తే.. పార్టీకి మరింత సానుకూలత వస్తుందని అభిప్రాయపడుతున్నారు. దీనితో సీఎం జగన్ స్వయంగా రంగంలోకి దిగబోతున్నారు. పార్టీ అభ్యర్ధి తరపున ఏప్రిల్ 14వ తేదీన ప్రచారం చేసేందుకు రెడీ అవుతున్నారు.

Read also : ప్రైవేటు టీచర్లకు ఈనెల 20 – 24 తేదీల మధ్య నగదు జమ, రేషన్ బియ్యం పంపిణీపై తెలంగాణ మంత్రుల చర్చ