Pawan Kalyan campaign in Tirupati : తిరుపతి బైపోల్ కాక పుట్టిస్తోంది. బీజేపీ, వైసీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ప్రచారం పీక్స్ కి చేరింది. ఓ రోజు ట్యూన్‌పై దుమారం. మరో రోజు వీడియో వివాదం..తర్వాత నామినేషన్‌పై సంవాదం..ఇంకోరోజు ట్వీట్లవార్. ఏ చిన్న విషయం దొరికినా పార్టీలు రచ్చరచ్చ చేస్తున్నాయి. ఇక, తిరుపతి లోక్‌సభ స్థానాన్ని ఎలాగైనా గెలుచుకోవాలనే పట్టుదలతో ఉన్న బీజేపీ… జనసేనాని పవన్‌పై ఎక్కువగా ఆధారపడుతోంది. తెలంగాణలో బీజేపీ, జనసేన మధ్య విబేధాలు రావడంతో… ఏపీ నేతలు కాస్త ముందే అలెర్ట్ అయ్యారు. తిరుపతి బైపోల్‌లో ఓట్లు రావాలంటే కచ్చితంగా జనసేనాని మద్దతు ఉండాల్సిందేనన్న వ్యూహంతో ఆయన్ను ప్రసన్నం చేసుకోవడం మొదలు పెట్టారు. పవనే రాష్ట్రానికి కాబోయే అధిపతి అంటూ బీజేపీ నేతలు అందుకున్న కొత్త పల్లవి బాగానే కలిసి వచ్చింది. దాని ఇంపాక్టో ఏమో కానీ… తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో రోడ్‌షోలకు సిద్ధమయ్యారు పవన్.
బీజేపీ – జనసేనల ఉమ్మడి అభ్యర్ధి రత్నప్రభ విజయం కోసం తిరుపతి ఎన్నికల ప్రచారంలో పవన్ పాల్గొంటున్నారు. తిరుపతిలోని ఎమ్మార్‌పల్లి సర్కిల్ నుండి శంకరంబాడి సర్కిల్ వరకూ ఆయన పాదయాత్ర ఉంటుందని ఆ పార్టీవర్గాలు తెలిపాయి. మధ్యాహ్నం 3 గంటలకు పాదయాత్ర ప్రారంభం అవుతుందని ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. పవన్ ప్రచారానికి వస్తుండటంతో బీజేపీ, జనసేన శ్రేణుల్లో జోష్ పెరిగింది. తిరుపతి స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలని చూస్తున్న బీజేపీకి పవన్ ఆశాకిరణంలా మారారు. పవన్ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని పక్కాగా ప్లాన్ చేశారు.
తిరుపతి పార్లమెంటరీ స్థానంలో పలుచోట్ల పవన్ కళ్యాణ్ తో రోడ్‌షోలతోపాటు బహిరంగ సభలు నిర్వహించేలా ప్లాన్ చేశారు. దీంతోపాటు తెలంగాణలోని దుబ్బాక నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన రఘునందన్‌రావు కూడా తిరుపతి ప్రచారంలో పాల్గొంటున్నారు. వీరితోపాటు బీజేపీ జాతీయస్థాయి నేతలు, కేంద్రమంత్రులు కూడా తిరుపతి ఎన్నికల ప్రచారంలో పాల్గొనేలా ఏపీ బీజేపీ ప్లాన్ చేసింది. ఇక, ఇవాళ జనసేనాని నిర్వహించే పాదయాత్ర ఓ రేంజ్‌లో ఉంటుందని తెలుస్తోంది. పవన్‌కు ఘనస్వాగతం పలికేందుకు స్థానికనేతలు, కార్యర్తలతోపాటు రాయలసీమ జిల్లాల నుంచి నేతలు, కార్యకర్తలు, మహిళలు పెద్దయెత్తున తరలివచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. తిరుపతిలో బలిజ సామాజిక వర్గం ఎక్కువగా ఉండటం, ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేసి తిరుపతి నుంచి బరిలోకి దిగిన చిరంజీవిని అక్కడి ప్రజలు విజయతీరాలకు చేర్చడంతో పవన్ కళ్యాణ్ మీద బీజేపీ గట్టిగానే ఆశలు పెట్టుకుంది.
Read also : ‘వాళ్లు కరుసైపోవడమేకాదు, అకారణంగా ఇతరుల ప్రాణాలు తీసేసినవాళ్లుగా రికార్డులకెక్కుతున్నారు’