ఓటమి భయంతోనే రాళ్ల డ్రామాట.!, ర్యాలీలో రాళ్లు పడలేదని బాబు భద్రతా సిబ్బందే పోలీస్ విచారణలో చెప్పారంటోన్న ఏపీ మంత్రి

|

Apr 14, 2021 | 4:43 PM

Mekapati Goutham Reddy slams TDP Chief Chandrababu : ఏపీలో చేస్తోన్న అభివృద్ధే తిరుపతి ఉప ఎన్నికల్లో తమను గెలుపిస్తుందని మంత్రి,..

ఓటమి భయంతోనే రాళ్ల డ్రామాట.!, ర్యాలీలో రాళ్లు పడలేదని బాబు భద్రతా సిబ్బందే పోలీస్ విచారణలో చెప్పారంటోన్న ఏపీ మంత్రి
Follow us on

Mekapati Goutham Reddy slams TDP Chief Chandrababu : ఏపీలో చేస్తోన్న అభివృద్ధే తిరుపతి ఉప ఎన్నికల్లో తమను గెలుపిస్తుందని మంత్రి, వైసీపీ నేత మేకపాటి గౌతమ్ రెడ్డి చెప్పారు. ఓటమి భయంతోనే చంద్రబాబు రాళ్ల డ్రామా ఆడుతున్నారని మంత్రి నెల్లూరులో ఆరోపించారు. ప్రచార ర్యాలీలో రాళ్లు పడలేదని చంద్రబాబు భద్రతా సిబ్బందే పోలీసుల విచారణలో చెప్పారని గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా విషయంలో పుదుచ్చేరికి లేని అడ్డంకులు.. ఏపీకి ఎందుకు అని మంత్రి పనిలోపనిగా బీజేపీని ప్రశ్నించారు. ఇలాఉండగా, తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొన్న సోమవారం రోడ్‌షోలో రాళ్ల దాడి అంశం ఏపీ రాజకీయాల్లో రచ్చరచ్చ చేసిన సంగతి తెలిసిందే. తిరుపతిలోని గాంధీ రోడ్డు షోలో చంద్రబాబు ప్రసంగిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు ఆయన వాహనంపై రాయి విసిరారు. ఈ ఘటనలో ఓ మహిళతో పాటు యువకుడికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై తిరుపతి పశ్చిమ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడు నరసింహ యాదవ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

అయితే, చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు రాళ్లతో దాడి చేశారని పేర్కొన్నారు. ఈ దాడిలో పలువురు గాయపడగా.. వాహనాలు కూడా ధ్వంసమయ్యయని బాబు చెప్పుకొచ్చారు. ప్రచారం చేయకుండా భయపెట్టాలని చూస్తున్నారని బాబు ఆ సందర్భంలో ఆరోపించారు. కాగా.. తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్ దగ్గరపడుతుండటంతో అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ హోరాహోరిగా ప్రచారం చేస్తున్నాయి.

Read also : La Soufriere volcano : బద్ధలైన అగ్ని పర్వతం, భారీ స్థాయిలో ధూళి రేణువులు.. ద్వీపంలో తాగునీటికి కటకట