Chevireddy: చెవిరెడ్డికి కేబినెట్‌లో ఛాన్స్‌ లేనట్టే.. ఆయన ఆశించిన పదవి కట్టబెట్టిన సీఎం వైఎస్ జగన్

చిత్తూరు జిల్లాలో మంత్రి పదవుల ఆశావాహుల నుంచి ఒకరు తప్పుకున్నారు. తనకు మంత్రి పదవి వద్దు.. తుడా ఛైర్మన్ పదవే ముద్దన్న.. చెవిరెడ్డి విజ్ఞప్తిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిశీలించారు.

Chevireddy: చెవిరెడ్డికి  కేబినెట్‌లో ఛాన్స్‌ లేనట్టే.. ఆయన ఆశించిన పదవి కట్టబెట్టిన సీఎం వైఎస్ జగన్
Chevireddy Bhaskar Reddy
Follow us

|

Updated on: Apr 10, 2022 | 7:09 AM

Chevireddy Bhaskar Reddy: చిత్తూరు జిల్లా(Chittoor District)లో మంత్రి పదవుల ఆశావాహుల నుంచి ఒకరు తప్పుకున్నారు. తనకు మంత్రి పదవి వద్దు.. తుడా ఛైర్మన్(TUDA Chairman) పదవే ముద్దన్న.. చెవిరెడ్డి విజ్ఞప్తిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిశీలించారు. ఆయన కోరుకున్నట్లుగానే తుడా చైర్మన్ పదవిని మరో రెండేళ్లు కట్టబెడుతూ ఉత్తర్వుల జారీ చేశారు. మరో రెండేళ్ల పాటు తుడా ఛైర్మన్‌గా చివిరెడ్డి కొనసాగనున్నారు. దీంతో ఇప్పటి వరకు చిత్తూరు జిల్లాలో మంత్రి పదవి అశిస్తున్న అశావాహుల జాబితా నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తప్పుకున్నట్లైంది.

తిరుపతి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ ఛైర్మన్ గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కొనసాగిస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. తుడా ఛైర్మన్ గానే కొనసాగుతానని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసిన విజ్ఙప్తిని స్వీకరించారు సీఎం జగన్. తనకు మంత్రి పదవి ఇష్టం లేదని.. తుడా ఛైర్మన్ గానే కొనసాగుతానంటూ చెవిరెడ్డి చేసిన విజ్ఞప్తిని పరిశీలించారు ముఖ్యమంత్రి జగన్. దీంతో ఆయన పదవిని మరో రెండేళ్లు పొడిగించింది రాష్ట్ర ప్రభుత్వం. చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి తుడా ఛైర్మన్ పదవి కాలాన్ని కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఈమేరకు పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు.

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తుడా ఛైర్మన్ పదవి కాలం 2022 జూన్ 12తో ముగియనుంది. అయితే రెండు నెలల గడువు ఉన్నప్పటికీ.. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న మంత్రి పదవుల ఉత్కంఠతకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మంత్రి రేసులో ఉన్నట్లు వార్తలు వచ్చినప్పటికీ.. ఆయన మాత్రం తనకు తుడా ఛైర్మన్ పదవే కావాలని సీఎం వద్ద పట్టుబట్టడంతో.. మంత్రి పదవి రేసుకు తెర దించుతూ రెండు నెలలముందే చెవిరెడ్డి పదవిని కొనసాగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం.

దీంతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తుడా ఛైర్మన్ గా 2022 జూన్ 12 నుంచి 2024 జూన్ 12 వరకు మరో రెండేళ్ల పాటు కొనసాగనున్నారు. తాను ఆశించినట్లు తుడా ఛైర్మన్ పదవి కట్టబెట్టడంతో సీఎం జగన్ కు చెవిరెడ్డి భాస్కర్ కృతజ్ఞతలు తెలిపారు. తుడా ఛైర్మన్ గా కొనసాగుతూనే జిల్లాలో పార్టీ గెలుపునకు కృషి చేస్తానని చెవిరెడ్డి… సీఎం జగన్ వద్ద చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Read Also… Rishi Sunak: బ్రిటన్‌ ప్రధాని రేసులో భారతీయుడు.. ముందస్తు సర్వేలు ఏం చెబుతున్నాయి.. ఇంతకీ ఎవరితను?