వెరైటీ పూజలు.. వానల కోసం వింత ఆచారం.. ఆ రాత్రికే కుండపోత వర్షం

గ్రామ ప్రజలు మొత్తం ఏకమై వేడుకగా నిర్వహించిన కప్ప దేవర్ల పండుగ వర్షాన్ని తీసుకురావడంతో గ్రామస్తుల్లో ఆనందం పెల్లుబికింది. కప్పలను ఊరేగించి పూజలు చేసి పండుగ చేస్తే వర్షాలు వస్తాయని భావించే గ్రామస్తులు వర్షం కోసం ప్రతి ఏటా ఈ సాంప్రదాయం కొనసాగిస్తున్నారు. గ్రామమంతా ఇలాంటి వింత ఆచారానికి కట్టుబడి సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.

వెరైటీ పూజలు.. వానల కోసం వింత ఆచారం.. ఆ రాత్రికే కుండపోత వర్షం
Frog Wedding Ritual

Edited By: Jyothi Gadda

Updated on: Jul 17, 2025 | 9:11 PM

చిత్తూరు జిల్లా లోని గ్రామాల్లో వింత ఆచారాలు ఆనవాయితీగా మారాయి. వర్షాలు కోసం కొందరు, గ్రామాలు సుభిక్షంగా ఉండాలని మరికొందరు, చల్లం గా చూడాలంటూ గ్రామ దేవతలకు జాతరలు ఇలా చిత్తూరు జిల్లాలో ఎక్కడో ఒకచోట వింత ఆచారాలు సాంప్రదాయాలు గా కొనసాగు
తున్నాయి. ఇందులో భాగంగానే గత వారం కుప్పంలో వర్షం కోసం శాంతిపురం మండలం కర్లగట్ట లో ఏకంగా గ్రామానికి తాళం వేసి వలస వెళ్లిన జనం ఇప్పుడు పలమనేరు నియోజక వర్గంలో మరో వింత ఆచారాన్ని కొనసాగించారు.

బైరెడ్డి పల్లి మండలం పాతపేటలో కప్ప దేవర్ల పండుగ జరిపించారు. గ్రామమంతా సందడి చేశారు. వర్షాలు కురవాలని కప్పలకు పూజలు జరిపించారు. గ్రామంలోని గంగమ్మ గుడి ఆలయ పూజారి రామస్వామి ఒక చేత్తో కర్ర, మరో చేతిలో పెద్ద కప్పను పట్టుకొని గ్రామంలోని ప్రతి వీధి ప్రతి గడప కు వెళ్లగా ప్రతి ఇంటి ముందు కప్ప కు పూజలు చేసి ఊరంతా జాతర జరుపుకునేలా వంట సరుకులు సమీకరించారు. ప్రతి ఇంట్లో నుంచి వంటలు చేసేందుకు కావలసిన అన్ని నిత్యవసర సరుకులు సేకరించి గ్రామ పొలిమేరలోని చెరువు వద్దకు చేరుకున్నారు. అక్కడ మట్టితో గంగమ్మ ప్రతిమను తయారుచేసి ప్రతిష్టించిన గ్రామస్తులు కప్ప కు, గంగమ్మకు పూజలు చేసి మొక్కులు చెల్లించారు. గంగమ్మకు, కప్పకు అన్నప్రసాదాలను నైవేద్యంగా సమర్పించి గ్రామమంతా అక్కడే భోజనాలు చేసి కప్ప దేవర్ల పండుగను జరుపుకున్నారు.
ఇలా ఉదయం నుంచి సాయంత్రం వరకు కప్ప దేవర్ల పండుగ చేసుకున్న గ్రామస్తులు ఆ తరువాత కప్పను చెరువులో వదిలి వర్షాలు సమృద్ధిగా కురువాలని మొక్కుకున్నారు.

కప్ప కు పూజలు చేసి ఇంటికి చేరుకునే లోపు భారీ వర్షం కురుస్తుందన్న నమ్మకం విశ్వాసాన్ని చాటుకున్న గ్రామస్తులకు అనుకున్న కోరికనే తీరింది. ఇంటికి చేరుకునే లోపు రాత్రంతా వర్షం కురిసింది. గ్రామ ప్రజలు మొత్తం ఏకమై వేడుకగా నిర్వహించిన కప్ప దేవర్ల పండుగ వర్షాన్ని తీసుకురావడంతో గ్రామస్తుల్లో ఆనందం పెల్లుబికింది. కప్పలను ఊరేగించి పూజలు చేసి పండుగ చేస్తే వర్షాలు వస్తాయని భావించే గ్రామస్తులు వర్షం కోసం ప్రతి ఏటా ఈ సాంప్రదాయం కొనసాగిస్తున్నారు. గ్రామమంతా ఇలాంటి వింత ఆచారానికి కట్టుబడి సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..