AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: రైల్వే గేటు సమీపంలో అనుమానాస్పద రీతిలో తచ్చాడిన వ్యక్తి.. కట్ చేస్తే

తిరుపతి జిల్లా.. రేణిగుంట సమీపంలోని చింతలచేను రేల్వే గేట్.. వచ్చి పోయే ట్రైన్లు, అటుగా వెళ్లే వాహనాలతో ఆ ప్రాంతం హాడావుడిగా ఉంది.. ఈ క్రమంలో రైల్వే గేట్ సమీపంలో ఓ వ్యక్తి అటు ఇటు తిరుగుతున్నాడు.. ఈ సమయంలోనే అతను ఏదో టెన్షన్ పడుతూ.. తేడాగా కనిపిస్తున్నాడు..

Andhra: రైల్వే గేటు సమీపంలో అనుమానాస్పద రీతిలో తచ్చాడిన వ్యక్తి.. కట్ చేస్తే
Railway Gate
Shaik Madar Saheb
|

Updated on: Jul 18, 2025 | 12:42 PM

Share

తిరుపతి జిల్లా.. రేణిగుంట సమీపంలోని చింతలచేను రేల్వే గేట్.. వచ్చి పోయే ట్రైన్లు, అటుగా వెళ్లే వాహనాలతో ఆ ప్రాంతం హాడావుడిగా ఉంది.. ఈ క్రమంలో రైల్వే గేట్ సమీపంలో ఓ వ్యక్తి అటు ఇటు తిరుగుతున్నాడు.. ఈ సమయంలోనే అతను ఏదో టెన్షన్ పడుతూ.. తేడాగా కనిపిస్తున్నాడు.. దీంతో అక్కడున్న వారికి అనుమానం కలిగింది.. అతను ఎందుకు తిరుగుతున్నాడో అర్థం కాలేదు.. ఈ క్రమంలోనే పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో.. గంజాయ్ గప్పుమంటూ అసలు కథ వెలుగులోకి వచ్చింది.. గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెట్టు చేశారు. నిందితుడి నుంచి 6 కేజీల గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

వివరాల ప్రకారం..

శుక్రవారం చింతల చేను రైల్వే గేట్‌ సమీపంలో గంజాయ్ రవాణ చేస్తున్న వ్యక్తిని పట్టుకుని.. ఆరు కేజీల గంజాయ్ ను స్వాధీనం చేసుకున్నట్లు ఈస్ట్ పోలీసులు తెలిపారు. నిందితుడు ప్రకాశం జిల్లా, పామూరు మండలానికి చెందిన కదంబూరు రమేష్‌ గా పోలీసులు గుర్తించారు. గంజాయి సరఫరాలో ఒరిస్సా రాష్ట్రానికి చెందిన గోపాల్, చెన్నైకి చెందిన అభి అనే వ్యక్తులు ప్రధాన పాత్ర దారులుగా ఉన్నారని.. వారు పరారయ్యారని తెలిపారు. గంజాయి రవాణాలో సంబంధం ఉన్న ఇరువురి కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు. పట్టుపడ్డ నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్ తరలించామని.. ఈ కేసులో ఉన్న వారి కోసం గాలిస్తున్నామని ఈస్ట్ ఎస్ఐ హేమాద్రి తెలిపారు.

Ganja

Ganja

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
పవన్ కల్యాణ్‌ డిప్యూటీ సీఎం పదవిపై TV9 క్రాస్‌ఫైర్‌లో..
పవన్ కల్యాణ్‌ డిప్యూటీ సీఎం పదవిపై TV9 క్రాస్‌ఫైర్‌లో..
ఏపీ రాజకీయాల్లో ఆయనే నా ఫేవరెట్ పొలిటీషియన్- టీవీ9తో అంబటి
ఏపీ రాజకీయాల్లో ఆయనే నా ఫేవరెట్ పొలిటీషియన్- టీవీ9తో అంబటి
మావోయిస్ట్ వ్యూహాల్లో భారీ మార్పు? దేవుజీ ఇంటర్వ్యూలో వాస్తవాలు
మావోయిస్ట్ వ్యూహాల్లో భారీ మార్పు? దేవుజీ ఇంటర్వ్యూలో వాస్తవాలు
ఉగాది రోజున నాన్‌వెజ్ తినొచ్చా? తింటే ఏం జరుగుతుంది?
ఉగాది రోజున నాన్‌వెజ్ తినొచ్చా? తింటే ఏం జరుగుతుంది?
ఒంట్లో కొవ్వు కరిగించి.. మీ బాడీని ఏసీలా మార్చేసే మ్యాజిక్ జ్యూస్
ఒంట్లో కొవ్వు కరిగించి.. మీ బాడీని ఏసీలా మార్చేసే మ్యాజిక్ జ్యూస్
కరివేపాకు చికెన్ ఫ్రై.. ఇలా కాల్చుకుని తింటే యమా టేస్ట్..
కరివేపాకు చికెన్ ఫ్రై.. ఇలా కాల్చుకుని తింటే యమా టేస్ట్..
ఆ రోజు చిరంజీవి కూడా వచ్చారు.. TV9 క్రాస్‌ఫైర్‌లో అంబటి రాంబాబు..
ఆ రోజు చిరంజీవి కూడా వచ్చారు.. TV9 క్రాస్‌ఫైర్‌లో అంబటి రాంబాబు..
వాషింగ్ మెషీన్‌లో షూస్ క్లీనింగ్.. మీరు ఈ తప్పులు చేస్తున్నారా?
వాషింగ్ మెషీన్‌లో షూస్ క్లీనింగ్.. మీరు ఈ తప్పులు చేస్తున్నారా?
ఒకే ఒక్కడి కోసం ఎగ్జామ్ సెంటర్.. కట్‌చేస్తే.. ఊహించని ట్విస్ట్
ఒకే ఒక్కడి కోసం ఎగ్జామ్ సెంటర్.. కట్‌చేస్తే.. ఊహించని ట్విస్ట్
టీ20ల్లో టీమిండియాకి కోహ్లీ లాంటి కరెక్ట్ మొనగాడు దొరికాడు.
టీ20ల్లో టీమిండియాకి కోహ్లీ లాంటి కరెక్ట్ మొనగాడు దొరికాడు.