తిరుమల శ్రీవారి సన్నిధి ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక కేంద్రం.. అంతకంటే ముఖ్యంగా అత్యంత సున్నితమైన ప్రాంతం. అందుకే.. భద్రత విషయంలో కట్టుదిట్టంగా ఉంటుంది టీటీడీ. కానీ… ఎంత చేసినా కొండమీద భద్రత మాత్రం ఉండీ లేనట్టుండే బ్రహ్మపదార్థంలాగే మారుతోంది. లేటెస్ట్‌గా అలిపిరి మార్గంలో మరోసారి భద్రతా వైఫల్యం బైటపడింది. టీవీ సెట్లను కిందనుంచి పైకి తీసుకెళ్లి యదేచ్ఛగా అమ్మకాలు జరపడం విస్తుగొలుపుతోంది.
ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇద్దరు ముస్లిం వ్యక్తులు… టెలివిజన్ సెట్లతో స్కూటీపై తిరుమల చేరుకున్నారు. వీధివీధీ తిరుగుతూ సెకండ్ హ్యాండ్ టీవీలు అమ్ముకోవడం వీళ్ల వృత్తి. కొండపై GNC దగ్గర ట్రాఫిక్ కానిస్టేబుల్ వీళ్లను ఆపి, నిలదీస్తే పొంతన లేని సమాధానాలొచ్చాయి. అనుమానం వచ్చి ఇద్దరినీ అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. అలిపిరి దగ్గర మమ్మల్ని ఎవరూ ఆపలేదు… ఎలాంటి తనిఖీలూ చేయలేదు అంటూ వీళ్లు చెప్పిన మాటలు.. తిరుమల మార్గంలో తనిఖీ వ్యవస్థపై మరోసారి ప్రశ్నల్ని లేవనెత్తాయి.
అలిపిరి తనిఖీ కేంద్రం దగ్గర సిబ్బంది పనితీరుపై విమర్శలు కొత్తవి కాదు. నాలుగు రోజుల కిందట కర్ణాటక నుంచి ఓ కుటుంబం ఏకంగా పెంపుడు కుక్కతో తిరుమలకు చేరుకుంది. గతంలో గంజాయి, మద్యం, మాంసం ఆనవాళ్లు కూడా తిరుమలలో కనిపించాయి. చూస్తాం చేస్తాం అంటూ స్టేట్‌మెంట్లు ఇవ్వడమే తప్ప డ్యూటీ పట్ల టీటీడీ విజిలెన్స్ వాళ్ల చిత్తశుద్ధులు మచ్చుకైనా కనిపించవు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..