Tirupati: తిరుపతి నుంచి శ్రీకాళహస్తికి వెళ్తుండగా ఊహించని ప్రమాదం.. చిన్నారి సహా దంపతులు..

|

Jun 01, 2023 | 10:09 AM

Tirupati News: తిరుపతి జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసకుంది. ఏర్పేడు మండలం మేర్లపాక చెరువు వద్ద ఆర్టీసీ బస్సు.. కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో చిన్నారి సహా దంపతులు మృతిచెందారు.

Tirupati: తిరుపతి నుంచి శ్రీకాళహస్తికి వెళ్తుండగా ఊహించని ప్రమాదం.. చిన్నారి సహా దంపతులు..
Tirupati Accident
Follow us on

Tirupati News: తిరుపతి జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసకుంది. ఏర్పేడు మండలం మేర్లపాక చెరువు వద్ద ఆర్టీసీ బస్సు.. కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో చిన్నారి సహా దంపతులు మృతిచెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

అయితే, మృతులు తెలంగాణలోని మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లె వాసులుగా గుర్తించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. దంతాలపల్లికి చెందిన కుటుంబం తిరుపతి నుంచి శ్రీకాళహస్తికి కారులో వెళ్తూ.. ఆర్టీసీ బస్సును ఢీకొట్టిందని.. దీంతో కారు నుజ్జునుజ్జయిందని ఏర్పేడు సీఐ శ్రీహరి తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామన్నారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..