గన్‌మన్ కాల్పుల్లోనే తిక్కారెడ్డికి గాయాలయ్యాయి: బాలనాగిరెడ్డి

| Edited By:

Mar 16, 2019 | 12:42 PM

ప్రశాంతమైన గ్రామాల్లో టీడీపీ నేతలు అల్లర్లు సృష్టిస్తున్నారని మంత్రాలయం ఎమ్మెల్యే బాల నాగిరెడ్డి అన్నారు. ఎన్నికల కోడ్ ఉంటే తిక్కారెడ్డి అనుచరులు జెండాను ఎగురవేస్తున్నారని, అది ప్రశ్నించిన తమ కార్యకర్తలపైకి ఆందోళనకు దిగారని ఆయన ఆరోపించారు. అసలు గన్‌మన్‌కు కాల్పులు జరపాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని, ఆ కాల్పుల్లోనే తిక్కారెడ్డికి గాయాలు అయ్యాయని బాలనాగిరెడ్డి అన్నారు. మరోవైపు తనపై దాడులు జరిపింది వైసీపీ ఎమ్మెల్యే బాల నాగిరెడ్డి కుటుంబమే అని మంత్రాలయం టీడీపీ అభ్యర్థి తిక్కారెడ్డి అన్నారు. […]

గన్‌మన్ కాల్పుల్లోనే తిక్కారెడ్డికి గాయాలయ్యాయి: బాలనాగిరెడ్డి
Follow us on

ప్రశాంతమైన గ్రామాల్లో టీడీపీ నేతలు అల్లర్లు సృష్టిస్తున్నారని మంత్రాలయం ఎమ్మెల్యే బాల నాగిరెడ్డి అన్నారు. ఎన్నికల కోడ్ ఉంటే తిక్కారెడ్డి అనుచరులు జెండాను ఎగురవేస్తున్నారని, అది ప్రశ్నించిన తమ కార్యకర్తలపైకి ఆందోళనకు దిగారని ఆయన ఆరోపించారు. అసలు గన్‌మన్‌కు కాల్పులు జరపాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని, ఆ కాల్పుల్లోనే తిక్కారెడ్డికి గాయాలు అయ్యాయని బాలనాగిరెడ్డి అన్నారు.

మరోవైపు తనపై దాడులు జరిపింది వైసీపీ ఎమ్మెల్యే బాల నాగిరెడ్డి కుటుంబమే అని మంత్రాలయం టీడీపీ అభ్యర్థి తిక్కారెడ్డి అన్నారు. కావాలనే బాలనాగిరెడ్డి కుటుంబం గొడవకు దిగిందని, దాడులు జరుగుతున్న సమయంలో పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని ఆయన ఆరోపించారు.