Tiger Tension: విజయనగరం జిల్లాలో పులి కలకలం.. స్థానికులు ప్రమత్తంగా ఉండాలని దండోరా

స్థానికులు, చుట్టు పక్కల గ్రామప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు దండోరా వేయించారు.  సమీప గ్రామాల ప్రజలను అధికారులు  అప్రమత్తం చేశారు. విజయనగరం జిల్లాలో పులి సంచారం ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తోంది. దీంతో గ్రామ ప్రజలు కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నారు. 

Tiger Tension: విజయనగరం జిల్లాలో పులి కలకలం.. స్థానికులు ప్రమత్తంగా ఉండాలని దండోరా
Bengal Tiger

Updated on: Aug 27, 2022 | 8:21 PM

Tiger Tension in Vijayanagaram: విజయనగరం జిల్లాలో రాయల్ బెంగాల్ టైగర్ కలకలం సృష్టిస్తోంది. వంగర సమీపంలో పులి సంచారిస్తుందని.. ఈ మేరకు ఆనవాళ్లు పక్కాగా సేకరించి నిర్ధారించామని అటవీశాఖ అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే తాము పాదముద్రలను సేకరించామని తెలిపారు.  స్థానికులు, చుట్టు పక్కల గ్రామప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు దండోరా వేయించారు.  సమీప గ్రామాల ప్రజలను అధికారులు  అప్రమత్తం చేశారు. దీంతో గ్రామ ప్రజలు భయం గుప్పెట్లో బతుకుతున్నారు. కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నారు.

ఇప్పటికే రెండు రోజుల క్రితం అల్లు పాల్తేరు లో ఆవుపై దాడి చేసిన సంగతి తెలిసిందే. దీంతో పరిసర ప్రాంతాల్లోని ప్రజలు ఎప్పుడు ఎవరి పై పులి దాడి చేసి ప్రాణాలు తీస్తుందో అని వణికిపోతున్నారు. రాత్రింబవళ్లు గ్రామాల చుట్టు పహారా కాస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..