YSRCP: సీఎం చేయిస్తున్న సర్వేల్లో ఏముందో?.. ఒకళ్లిద్దరు తప్ప ఆ జిల్లా ఎమ్మెల్యేలందరికీ అదే భయమట.. అదంతే..

|

Nov 14, 2022 | 8:48 PM

ఆ ఎమ్మెల్యేల్లో టిక్కెట్ గుబులు నెలకొందట. తిరిగి పోటీ చేసే అభ్యర్థి తామేనా అన్న అనుమానం ఆందోళనగా మారిందట. మళ్లీ సీటు వచ్చే లిస్టులో తామున్నామా లేదా అన్న అనుమానం ఆ జిల్లా ఎమ్మెల్యేల్లో కంగారు పుట్టిస్తోందట. ఆ కంగారుతో గడపగడపకు పరిగెడుతున్నారట. దీనికితోడు వై నాట్‌ 175? ఆ కంగారును మరింత పెంచుతోందిట..

YSRCP: సీఎం చేయిస్తున్న సర్వేల్లో ఏముందో?.. ఒకళ్లిద్దరు తప్ప ఆ జిల్లా ఎమ్మెల్యేలందరికీ అదే భయమట.. అదంతే..
YSRCP
Follow us on

దీంతో ఎమ్మెల్యేలంతా గడపగడపకు పరిగెడుతున్నారట. ఎక్కే గడప దిగే గడపతో ఆయాసం నీరసం వచ్చినా ఆగట్లేదుట. తాము జనం మధ్యే ఉన్నామనే సందేశం సీఎం వైఎస్‌ జగన్‌కు చేరితే తప్ప సిట్టింగ్‌ సీటు దక్కించుకోలేమని వాళ్లలా పరుగులు తీస్తున్నారట. ఉమ్మడి చిత్తూరు జిల్లా అధికారపార్టీ ఎమ్మెల్యేల్లో కొత్త టెన్షన్ నెలకొందిట. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు మినహా మిగిలిన ఎవరికీ టికెట్‌పై క్లారిటీ లేని పరిస్థితి ఉందిట. ఇది ఎమ్మెల్యేల్లో గందరగోళానికి కారణం అయ్యిందట. 2024 లో వై నాట్ 175 టార్గెట్ కూడా కలరపెడుతోందంటున్నారు. ఎమ్మెల్యేల పనితీరు, జనం మధ్య వాళ్లున్నారా లేదా అన్న దానిపై సీఎం జగన్ సర్వేల్లో ఏముందో తెలియని పరిస్థితిలో ఉమ్మడి చిత్తూరు జిల్లా లోని ఎమ్మెల్యేల్లో ఆందోళన నెలకొందని చెబుతున్నారు.

మంత్రుల నుంచి ఎమ్మెల్యేల దాకా సీఎం లిస్టులో తిరిగి తాముంటామా లేదా అన్న కన్ఫ్యూజన్ అందరినీ వెంటాడుతోందట. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ముగ్గురు మంత్రులతోపాటు అధికార పార్టీ ఎమ్మెల్యేలు 10 మందిలో ఒకరిద్దరికి మాత్రం తమ సీటుపై పక్కా క్లారిటీ ఉందట. వాళ్లలో మాత్రం ఎలాంటి గందరగోళం లేదట. మిగతావాళ్లు పైకి ధీమాగానే ఉన్నా బయట జరుగుతున్న ప్రచారం వాళ్లకు ఆందోళన కలిస్తోందట.

కొందరికి టికెట్‌ రాదంటూ ప్రచారం

దీంతో గడపగడపకి మన ప్రభుత్వం పేరుతో ఇంటింటికి వెళ్లి ఓటర్లను పార్టీ కేడర్‌ని ప్రసన్నం చేసుకునే పనిలో తిప్పలు పడుతున్నారట అధికార పార్టీ ఎమ్మెల్యేలు. 2024లో కూడా సీటు తమకేనని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారట. గత మూడేళ్లుగా కొంత మంది ఎమ్మెల్యేలు కేడర్‌కి దూరంగా ఉన్నా ఇప్పుడు ఆ గ్యాప్‌ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారట.

ఇక తమకు టిక్కెట్ రాదన్న నిర్ణయానికి వచ్చి ఎమ్మెల్యేలు మాత్రం ఎలాంటి టెన్షన్‌ లేకుండా సొంత పనులు చక్కపెట్టుకుంటూ గడపగడపకు వెళుతూ అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నం చేస్తున్నారట. ప్రత్యేకించి ఎస్సీ రిజర్వ్‌డ్‌ నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి ఉందట. కొందరు ఎమ్మెల్యేల పనితీరు పట్ల అసంతృప్తిగా ఉన్న కేడర్ కొన్ని చోట్ల బాహాటంగానే ఇక ఈసారి వీరికి టికెట్‌ రాదని ప్రచారం కూడా చేస్తున్నారని సమాచారం.

అయితే మూడేళ్లు ఎలాగూ గడచిపోయింది. మిగిలిన కాలమైనా కేడర్ ను ప్రసన్నం చేసుకుంటే అధిష్టానం ఆశీర్వదిస్తుందన్న నమ్మకంతో దూకుడు పెంచిన ఎమ్మెల్యేలు సమయం దొరికితే చాలు గడపగడపకు మన ప్రభుత్వం పేరుతో ప్రతి గ్రామాన్ని చుట్టేస్తున్నారట.

మరిన్ని ఏపీ న్యూస్ కోసం