Thunderstorms Alert: ఏపీలోని ఆ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని..

ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో బుధవారంనాడు బుధవారంనాడు (మే 15) పిడుగులతో కూడిన వర్షాలు కురవనున్నాయి.  అల్లూరి సీతారామరాజు, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ  వెల్లడించింది.

Thunderstorms Alert: ఏపీలోని ఆ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని..
Thunderstorms Alert

Updated on: May 14, 2024 | 5:46 PM

ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో బుధవారంనాడు బుధవారంనాడు (మే 15) పిడుగులతో కూడిన వర్షాలు కురవనున్నాయి.  అల్లూరి సీతారామరాజు, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ  వెల్లడించింది. గురువారంనాడు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు.

ఉరుములతో కూడిన వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించారు. మంగళవారం సాయంత్రం 5 గంటల నాటికి ప్రకాశం జిల్లా కనిగిరిలో 43.5మిమీ,గుంటూరు జిల్లా ఫిరంగిపురం 34మిమీ, ప్రత్తిపాడులో 33మిమీ, అల్లూరి జిల్లా జీకే వీధిలో 30మిమీ,ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో 29మిమీ, నంద్యాల జిల్లా ఆత్మకూరులో 25.5మిమీ, మంగళగిరిలో 25.5మిమీ, పల్నాడు అమరావతిలో 19.5మిమీ చొప్పున వర్షపాతం నమోదైందన్నారు.

అలాగే బుధవారంనాడు శ్రీకాకుళం 9, విజయనగరం 12, మన్యం 10, అల్లూరిసీతరామరాజు 3 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు. మంగళవారంనాడు అల్లూరి సీతారామరాజు జిల్లా గంగవరం, తిరుపతి జిల్లా రేణిగుంటలో 40.6°C, వైయస్ఆర్ జిల్లా సిద్ధవటంలో 40.3°C, తూర్పుగోదావరి జిల్లా సీతానగరం, ప్రకాశం జిల్లా మార్కాపురంలో 40.2°C, ఏలూరు జిల్లా పోలవరంలో 40.1°C అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు.