Attack on Constable: కానిస్టేబుల్‌పై దాడి చేసిన ముగ్గురు నిందితులు అరెస్ట్.. రౌడీ షీట్లు నమోదు

|

Oct 11, 2021 | 5:57 PM

కృష్ణాజిల్లా మచిలీపట్నం రైతు బజారులో కానిస్టేబుల్ నాగరాజుపై దాడికి పాల్పడ్డ ముగ్గురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. మాస్కులు పెట్టుకోలేదని

Attack on Constable: కానిస్టేబుల్‌పై దాడి చేసిన ముగ్గురు నిందితులు అరెస్ట్.. రౌడీ షీట్లు నమోదు
Attack On Police
Follow us on

Machilipatnam Constable: కృష్ణాజిల్లా మచిలీపట్నం రైతు బజారులో కానిస్టేబుల్ నాగరాజుపై దాడికి పాల్పడ్డ ముగ్గురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. మాస్కులు పెట్టుకోలేదని అడిగినందుకు కానిస్టేబులుపై రాడ్డుతో దాడి చేసిన ముగ్గురు యువకులు తబ్రేజ్, జానీ, అబ్దుల్ అజీజ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఉదయం పోలీసు ఐటీ టీంలో విధులు నిర్వహిస్తున్న నాగరాజుపై దాడి చేసిన ఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే.

పోలివు ఐటీ టీములో విధులు నిర్వహిస్తున్న నాగరాజు తన విధులు ముగించుకుని వస్తూ రైతు బజారు సమీపంలో మాస్కు లేకుండా దగ్గుతూ ఉన్న తబ్రేజ్ ను మందలించడంతో వాదనకు దిగి.. తన తమ్ముళ్ళు అయిన జానీ, అబ్దుల్ అజీజ్‌ను పిలిపించి దాడికి దిగినట్లు డీఎస్పీ మాసూమ్ బాషా తెలిపారు. దాడి చేసిన ముగ్గురు యువకులను చిలకలపూడి పోలీసులు అరెస్ట్ చేసినట్టు డీఎస్పీ వెల్లడించారు. కాగా, దాడికి గురైన వెంటనే సదరు కానిస్టేబుల్‌ నాగరాజును చికిత్స నిమిత్తం గవర్నమెంట్ హాస్పిటల్‌కు తరలించారు స్థానికులు.

కాగా, నిందితులు ముగ్గురుని రిమాండ్ కు తరలించడం జరుగుతుందని డీఎస్పీ తెలిపారు. రైతు బజార్ వద్ద మాస్క్ ధరించకుండా నిర్లక్ష్యంగా ఉండడమే కాకుండా పోలీస్ ఆఫీసర్ మీద దాడి చేసిన ఘటనను జిల్లా ఎస్పీ శ్రీ సిద్ధార్థ కౌశల్ ఐపీఎస్ సీరియస్ గా తీసుకోవడం జరిగిందని వెంటనే కేసు నమోదు చేసి ముగ్గురు ముద్దాయిలను అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించామని డీఎస్పీ చెప్పారు. వారిపై రౌడీషీట్లు కూడా ఓపెన్ చేయడం జరుగుతుందని డీఎస్పీ షేక్ మాసూమ్ భాష వెల్లడించారు.

Read also: Children Missing: తల్లితోపాటు చెరువు దగ్గరకు వెళ్లి కనిపించకుండాపోయిన ముగ్గురు చిన్నారులు