Andhra Pradesh: భళ్లారి నుంచి గుంటూరు వస్తుండగా ఊహించని ప్రమాదం.. స్పాట్లోనే ముగ్గురు మృతి.. మిగతా వారంతా

గుంటూరు వాసులు.. భళ్లారి వెళ్లారు.. అనంతరం అక్కడి నుంచి బయలుదేరారు.. మరికాసేపట్లో ఇంటికి చేరుతామనుకున్న క్రమంలోనే మృత్యువు వెంటాడింది.. ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు.. మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి..

Andhra Pradesh: భళ్లారి నుంచి గుంటూరు వస్తుండగా ఊహించని ప్రమాదం.. స్పాట్లోనే ముగ్గురు మృతి.. మిగతా వారంతా
Road Accident

Updated on: Jun 27, 2024 | 12:15 PM

గుంటూరు వాసులు.. భళ్లారి వెళ్లారు.. అనంతరం అక్కడి నుంచి బయలుదేరారు.. మరికాసేపట్లో ఇంటికి చేరుతామనుకున్న క్రమంలోనే మృత్యువు వెంటాడింది.. ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు.. మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి.. ఇన్నోవా కారు చెట్టును ఢీకొట్టి ముగ్గురు మరణించిన ఘటన పల్నాడు జిల్లా వినుకొండ మండలం అందుగుల కొత్తపాలెం సమీపంలో గురువారం ఉదయం చోటుచేసుకుంది.

గురువారం తెల్లవారుజామున అతివేగంగా వచ్చిన ఇన్నోవా కారు.. అందుగుల కొత్తపాలెం సమీపంలో చెట్టును ఢీకొట్టింది.. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. ఐదుగురికి తీవ్రగాయాలైనట్లు పోలీసులు తెలిపారు. మృతులు గుంటూరుకు చెందిన వారిగా గుర్తించారు. అనంతరం మృతదేహాలను వినుకొండ ప్రభుత్వ వైద్యశాల తరలించారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు..

వీరంతా బళ్లారి నుంచి గుంటూరు వస్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిద్రమత్తులో వాహన చెట్టును ఢీకొన్నట్లు పేర్కొంటున్నారు.

ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..