Vijayawada: హత్యలా..? ఆత్మహత్యలా..? ఇంకా వీడని ఆ మూడు మరణాల మిస్టరీ..! వివరాలివే..

| Edited By: శివలీల గోపి తుల్వా

Aug 06, 2023 | 1:23 PM

Krishna District: కృష్టా జిల్లాలో ఇటీవల జరిగిన మరణాలకు కారణం హత్యా, లేదా ఆత్మహత్యా అనేది తేల్చలేక తలలు పట్టుకుంటున్నారు అధికారులు. పెనమలూరు నియోజకవర్గంలో అవనిగడ్డ-విజయవాడ రైవస్ కాలువలో కారుతో సహా గల్లంతైన రత్న భాస్కర్ కేస్ ఇంకా మిస్టరీగానే ఉంది. హత్య అనేలా అనుమానాలు తప్పా ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఈ ఘటన జరిగి రెండు నెలలు గడుస్తున్నా కేస్‌లో ఎలాంటి పురోగతి..

Vijayawada: హత్యలా..? ఆత్మహత్యలా..? ఇంకా వీడని ఆ మూడు మరణాల మిస్టరీ..! వివరాలివే..
Ratna Bhaskar; Minor, Doctor Radha
Follow us on

కృష్ణా జిల్లా, ఆగస్టు 6: కృష్ణా జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మూడు మరణాల మిస్టరీ ఇంకా వీడలేదు. రెండు నెలల వ్యవధిలో ముగ్గురి మరణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తూనే ఉన్నారు. హత్యా, లేదా ఆత్మహత్యా అనేది తేల్చలేక తలలు పట్టుకుంటున్నారు అధికారులు కూడా. పెనమలూరు నియోజకవర్గంలో అవనిగడ్డ-విజయవాడ రైవస్ కాలువలో కారుతో సహా గల్లంతైన రత్న భాస్కర్ కేస్ ఇంకా మిస్టరీగానే ఉంది. హత్య అనేలా అనుమానాలు తప్పా ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఈ ఘటన జరిగి రెండు నెలలు గడుస్తున్నా కేస్‌లో ఎలాంటి పురోగతి లేదు. ‘ఇంటికి వస్తున్నా’ అని భార్యకు ఫోన్ చేసి చెప్పిన రత్న భాస్కర్.. అవసరం, సంబంధం లేని ఒక రూట్‌లో కారులో గల్లంతయ్యాడు. అది కూడా చనిపోవడానికి అవకాశం లేని విధంగా ఉన్నట్టుండి కాలువలో కొట్టుకుపోయి రెండు రోజుల తర్వాత ఒంటిపై బట్టలు లేకుండా శవమై దొరికాడు. ఈ కేస్ జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పటివరకు ఈ కేస్‌ మిస్టరీగానే మిగిలిపోయింది..

ఇక రెండోది పామర్రులో మైనర్ బాలిక మిస్సింగ్ ఉందంతం నాలుగు రోజుల తర్వాత విషాదంగా మిగిలింది. మొదట మిస్ అయినా బాలిక తర్వాత ఊరి శివారులోని కాలువలో శవమై తేలింది. ఈ కేస్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రేమ పేరుతో ట్రాప్ చేసిన ఇద్దరు అన్నదమ్ములు మరో వ్యక్తి సహాయంతో స్కూల్‌లో ఉన్న మైనర్‌ను లాడ్జ్‌కు తీసుకుని వెళ్ళి అత్యాచారం చేసారు. ఈ విషయాన్ని వారే స్వయంగా ఒప్పుకున్నా.. హత్య మాత్రం తాము చెయ్యలేదని ఆ రోజే ఊర్లో దింపేశామని ఆ ముగ్గురు విచారణలో చెప్పారు. పోలీసులు కూడా..  విషయం బయటకు వచ్చిన రోజు అవమానం భరించలేక ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుని ఉంటుందని అనుమానం వ్యక్తం చేసారు కానీ ఎలాంటి ఆధారాలు చూపించలేకపోయారు. ఇప్పటికి హత్యా ,ఆత్మహత్యా అనేది తేల్చలేక పోలీసులు తలలు పట్టుకున్నారు.

ఇవి కూడా చదవండి

ఇక మూడోది మచిలీపట్నంలో వైద్యురాలు రాధా కేస్.. ఈ కేస్ మొదటి నుండి మిస్టరీగానే ఉంది. ది కాస్ట్లీ మర్డర్ అని టాక్ కూడా ఉంది. బాగా డబ్బులున్న డాక్టర్ రాధా ఇంట్లోకి చొరపడ్డ దొంగలు ఇంట్లోని వెండి ,బంగారం ,కట్టలకొద్ది డబ్బులు వొదిలేసి ఏదో డాక్టర్ రాధనే హత్య చెయ్యటానికి వచ్చినట్లు వెంటాడి మరి కంట్లో కారం కొట్టి తొంతు కోసి చంపి ఒంటిపై ఉన్న మొత్తం బంగారం కూడా కాకుండా కొద్దిగా తీసుకుని పారిపోయారు. కింద ఆస్పత్రి‌, పైన ఇళ్ళు, భర్త కూడా కిందే ఉన్నాడు. పైకి ఎవరు వెళ్లే అవకాశం లేదు. పైగా మూడు నెలలుగా సీసీ కెమెరాలు పని చెయ్యటంలేదు. ఇలా కేస్ ఎటూ కదలటం లేదు.. భర్తే ఏదో చేపించాడని గుసగుసలు ఉన్నా పోలీసులు ఇప్పటివరకు ఎటూ తేల్చటం లేదు. దీంతో ఈ కేస్ కూడా ఇంకా మిస్టరీ కొనసాగుతూనే ఉంది. సంచలనం సృష్టించిన ఈ మూడు కేసులను పోలీసులు ఎలా కొలిక్కి తెస్తారో వేచి చూడాలి.