Krishna District: అడ్డదారిలో డబ్బు సంపాదించాలనే ఉద్దశ్యంతో దుండగులు తెగబడుతున్నారు. ఏటీఎంలను కొల్లగొట్టేందుకు ప్రయత్నాలు చేస్తూ.. సాధ్యం కాకపోవడంతో పరారవుతున్నారు. తాజాగా ఏపీలోని కృష్ణా జిల్లాలో ఏటీఎం చోరికి విఫలయత్నం చేశారు. సంచలనంగా మారిన ఈ చోరి ఘటన కృష్ణా జిల్లాలోని మొవ్వ మండలం కూచిపూడి గ్రామంలో జరిగింది. ఎస్‌బీఐ ఏటీఎం చోరీకి దుండగులు ప్రయత్నం చేశారు. ఇద్దరు దుండగులు ఏటీఎం సెంటర్ లోపలికి ప్రవేశించి.. చోరికి ప్రయత్నం చేశారు. (SBI ATM) ఏటీఎంను ధ్వంసం చేశారు. ఈ క్రమంలో అలారం మోగడంతో దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. అలారం విన్న స్థానికులు అక్కడికి చేరుకొని పరిశీలించారు. ఏటీఎం చోరి గురించి బ్యాంకు సిబ్బంది, స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకొని పరిశీలించారు.
అయితే.. నగదు పోకపోవడంతో బ్యాంక్ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. బ్యాంకు సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇద్దరు దుండగులు చోరికి ప్రయత్నించిన దృశ్యాలు సీసీ టీవీలో రికార్డయ్యాయి. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒకరికి మాస్క్ ఉండగా.. మరొకరికి మాస్క్ లేదు. కానీ వారు ధైర్యంగా దొంగతనం చేసేందుకు ఏటీఎంలోకి ప్రవేశించారు.
Also Read: