Andhra Pradesh: అమ్మాయిలు కాదు అబ్బాయిలే టార్గెట్..వీడి కన్ను పడిందంటే అంతా మటాష్..

|

Dec 09, 2022 | 2:35 PM

సాధారణంగా మహిళల మెడలోనో బంగారు చెయిన్ లు తెంచుకొని పారిపోతున్న దొంగలను చూస్తుంటాం. ఏకంగా బైక్ పై వచ్చి చెయిన్ స్నాచింగ్స్ పాల్పడటం కళ్ళకు కట్టినట్లు సిసి కెమెరాల్లో రికార్డు అవటం...

Andhra Pradesh: అమ్మాయిలు కాదు అబ్బాయిలే టార్గెట్..వీడి కన్ను పడిందంటే అంతా మటాష్..
Chain Snaching Vijayawada
Follow us on

సాధారణంగా మహిళల మెడలోనో బంగారు చెయిన్ లు తెంచుకొని పారిపోతున్న దొంగలను చూస్తుంటాం. ఏకంగా బైక్ పై వచ్చి చెయిన్ స్నాచింగ్స్ పాల్పడటం కళ్ళకు కట్టినట్లు సిసి కెమెరాల్లో రికార్డు అవటం చూసే ఉంటారు. ఒంటరి మహిళలను టార్గెట్ చేస్తూ చెయిన్ స్నాచింగ్ లు జరుగుతున్నాయి. అయితే గుంటూరుకు రామిరెడ్డి తోటకు చెందిన బషీర్ రూటే సపరేటు. అమ్మాయిలు, ఆంటీల జోలికి వెళ్ళడు. వాళ్ళ మెడల్లోని బంగారు ఆభరణాలను తెంచుకొని పోడు. అయితే ఏంటి అంటారా. అబ్బాయిలు మెడలో బంగారు గొలుసు కనపడితే చాలు. అతని చేయి మాత్రం ఊరుకోదు‌. ఎలాగైనా కొట్టేయాలనుకుంటాడు. ఒకసారి విజయవాడలో ఒక స్కూటీ వద్ద నిలబడ్డాడు. ఈ స్కూటీ యజమాని అయిన కుర్రవాడు రాగానే తన చేతికున్న కట్టు చూపించాడు. ఒక నకిలీ తాళం అతని చేతికిచ్చి నా బండి సమీపంలో ఉన్న మెడికల్ షాపు వద్ద ఉందని దాన్ని తీసుకురావాలని నమ్మించి పంపించాడు. స్కూటీ కుర్రాడు మెడికల్ షాపు వద్దకు వెళ్ళి వచ్చే లోపు స్కూటిని అపహరించాడు.‌

ఆ స్కూటీ పై చీరాల వెళ్ళాడు. ఒంటరిగా వెలుతున్న కుర్రాడిని ఆపి టైం అడిగాడు. అతను టైం చెప్పేలోపు అతని మెడలోని 16 గ్రాములు బంగారు గొలుసు తెంచుకొని పారిపోయాడు. తెనాలి పానీ పూరి బండి వద్ద మాటు వేశాడు. ఒక కుర్రాడు పాని పూరి తినడాన్ని గమనించాడు. బైక్ పై అక్కడకు వచ్చిన బషీర్ ఆ కుర్రాడు డబ్బులు చెల్లిస్తున్న సమయంలో చిల్లర కింద పడిందని నమ్మించాడు. ఆ కుర్రాడు చిల్లర తీసుకోవటానికి కిందకు చూడగానే అతని మెడలోని 24 గ్రాములు బంగారు చెయిన్ తెంచుకుని వెళ్లిపోయాడు.

ఇలాంటి ఘటనలతో అప్రమత్తమైన తెనాలి పోలీసులు బషీర్ కోసం వేట ప్రారంభించారు. దొంగలించిన బంగారాన్ని అమ్ముకునే ప్రయత్నంలో పోలీసులకు దొరికిపోయాడు. అతని వద్ద నుండి 5,40,000 రూపాయల విలువైన బంగారు ఆభరణాలు, సెల్ ఫోన్లు, స్కూటీ స్వాధీనం చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..