Viral News: హిందువులు ఎంతో పవిత్రంగా భావించే మాసాల్లో కార్తీక మాసం ఒకటి. నెల రోజుల పాటు పరమ శివుడిని దీపాలతో పూజిస్తూ ఆ దేవ దేవుడి కృపకు పాతృలు కావడానికి భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఇలా సాగిన ఈ పవిత్ర మాసం ఆదివారంతో ముగిసింది. అయితే ఆదివారం కార్తీక మాసం చివరి రోజున తూర్పు గోదావరి జిల్లాలో ఓ అద్భుతం చోటుచేసుకుంది. శంకువుఉ పోలిన కంద దుంప దర్శనమిచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
వివరాల్లోకి వెళితే తూర్పు గోదావరి జిల్లా వాడపాలెంలోని ఆంజనేయస్వామి ఆలయం వద్ద శనివారం కాలువ రేవు దీపోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితుడు పెద్దింటి రామం భక్తులతో ప్రత్యేక పూజలు జరిపించారు. కార్తీక మాసం చివరి రోజు కావడంతో పూజలు పెద్దఎత్తున నిర్వహించారు. ఈ క్రమంలోనే భారీ ఎత్తున ప్రజలు పూజకు హాజరయ్యారు. వీరిలో ఓ భక్తురాలు స్వయంపాకం కోసం బియ్యంతో పాటు పలు కూరగాయలు సమర్పించారు.
అయితే ఈ స్యయంపాకంలో ఉన్న వస్తువులను గమనించే క్రమంలో పూజారికి అద్భుత దృశ్యం కనిపించింది. అందులో ఉన్న కంద దుంప శంఖం ఆకారంలో కనిపించింది. దీంతో అక్కడనున్న వారంతా ఆశ్చర్యపోయారు. సాక్షాత్తు ఆ విష్ణు మూర్తి దర్శనమిచ్చారంటూ భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఇక ఈ కంద దుంప ఫోటోను కెమెరాలో బంధించిన స్థానికులు నెట్టింట వైరల్ చేస్తున్నారు.
Also Read: Twitter Audio: ఇకపై ట్వీట్లను చదవడమే కాదు, వినొచ్చు కూడా.. సరికొత్త ఫీచర్ తీసుకొస్తున్న ట్విట్టర్..
Sonu Sood: రియల్ హీరోకు మరోసారి షాక్.. అక్రమంగా హోటల్ నిర్మించారంటూ..