Liquor Price: మందు బాబులకు బ్యాడ్ న్యూస్.. ఏపీలో పెరిగిన మద్యం ధరలు.. కారణాలివే..

|

Nov 18, 2023 | 10:57 AM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మందుబాబులకు తాగకుండానే కిక్ ఇచ్చింది. మరోసారి మద్యం ధరలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో రూపాయల్లో విధించే పన్నును శాతాల్లోకి మారుస్తున్నట్లు ఎక్సైజ్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ భార్గవ వెల్లడించారు. ట్యాక్స్‌ను సవరించాలన్న ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ విధానం వల్ల అన్ని మద్యం బ్రాండ్లపై ఒకే రకమైన భారం పడుతుంది.

Liquor Price: మందు బాబులకు బ్యాడ్ న్యూస్.. ఏపీలో పెరిగిన మద్యం ధరలు.. కారణాలివే..
The Excise Department Has Issue Orders Increasing The Prices Of Liquor In Ap
Follow us on

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మందుబాబులకు తాగకుండానే కిక్ ఇచ్చింది. మరోసారి మద్యం ధరలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో రూపాయల్లో విధించే పన్నును శాతాల్లోకి మారుస్తున్నట్లు ఎక్సైజ్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ భార్గవ వెల్లడించారు. ట్యాక్స్‌ను సవరించాలన్న ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ విధానం వల్ల అన్ని మద్యం బ్రాండ్లపై ఒకే రకమైన భారం పడుతుంది. క్వార్టర్ సీసాపై రూ. 10, ఫుల్ బాటిల్‌పై రూ. 20 పెంచుతూ ఎక్సైజ్ శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విధానంతో కొన్ని రకాల మద్యం బ్రాండ్లపై ధరలు తగ్గుదల కనిపించింది. అయితే అవి ఇక్కడ అందుబాటులో లేకపోవడం గమనార్హం. వీటిని ఎక్కువ మంది కొనుగోలు చేయకపోవడం వల్ల వాటి ధరలు తక్కువగా ఉన్నట్లు తెలిపారు అధికారులు.

ప్రస్తుతం వ్యాట్‌ వసూళ్లలో మార్పులు తీసుకురావడం వల్ల తరచూ విక్రయించే బ్రాండ్లపై కొంత భారం పడింది. క్వార్టర్ బాటిల్‌పై రూ. 10-40 వరకూ, హాఫ్ బాటిల్‌పై రూ. 10-50 వరకూ, ఫుల్ బాటిల్‌పై రూ. 10-90 వరకూ ధరల్లో వ్యత్యాసం కనిపిస్తోంది. మద్యం బాటిళ్లపై ఉన్న ఐఎంఎఫ్ఎల్ ఆధారంగా పన్నుల శాతాల్లో మార్పులు కనిపిస్తున్నాయి. ఐఎంఎఫ్ఎల్ కనీస ధర రూ. 2,500 లోపు ఉంటే దానిపై 250శాతం, రూ. 2,500 దాటితే దానిపై 150శాతం పన్నులు విధించినట్లు తెలిపారు. ఇక బీరుపై 225%, వైన్‌పై 200%, విదేశీ మద్యంపై 75% ఎఆర్ఈటీ ఉంటుందని పేర్కొన్నారు. విదేశీ బ్రాండ్ల పై ఉన్న ధరలను చాలా కాలంగా పెంచలేదని, వాటి రవాణా, ఇతర ఖర్చుల ఆధారంగా ప్రస్తుతం పెంచామని వివరించారు.

గతంలో 180ఎంఎల్ లిక్కర్ సీసా ధర రూ. 150 కాగా ప్రస్తుతం అలాగే ఉంది. అయితే 750 ఎంఎల్ మద్యం బాటిల్ ధర గతంలో 800 కాగా ఇప్పుడు కూడా అలాగే స్థిరంగా ఉంది. కొన్ని 180ఎంఎల్ లిక్కర్ బ్రాండ్ల పై రూ. 200 నుంచి రూ. 210 పెరిగింది. అంటే రూ. 10 అదనంగా చెల్లించాలి. కొన్ని 750 ఎంఎల్ లిక్కర్ సీసా ధర గతంలో రూ. 4330 ఉండగా ప్రస్తుతం రూ. 5450కి పెరిగింది. అంటే.. రూ. 1120 పెరిగిందన మాట. ఇలా కొన్నింటిపై ట్యాక్స్ ప్రభావం పడితే.. మరి కొన్నింటిపై స్థిరంగా కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి

Ap Liquor Price Page 1

Ap Liquor Price Page 2

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..