AP Politics: చంద్రబాబుకు నోటీసులు జారీ చేసిన ఎన్నికల సంఘం.. కారణమిదే

AP Politics: చంద్రబాబుకు నోటీసులు జారీ చేసిన ఎన్నికల సంఘం.. కారణమిదే

Balu Jajala

|

Updated on: Apr 04, 2024 | 9:31 PM

వైఎస్సార్ సీపీకి వ్యతిరేకంగా మార్చి 31న చేసిన ప్రసంగంపై వివరణ ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి గురువారం నోటీసులు జారీ చేసింది. ఎమ్మిగనూరు, మార్కాపురం, బాపట్ల నియోజకవర్గాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో

వైఎస్సార్ సీపీకి వ్యతిరేకంగా మార్చి 31న చేసిన ప్రసంగంపై వివరణ ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి గురువారం నోటీసులు జారీ చేసింది. ఎమ్మిగనూరు, మార్కాపురం, బాపట్ల నియోజకవర్గాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ ను రాక్షసుడు, దొంగ అని సంబోధిస్తూ చంద్రబాబు నాయుడు అసభ్య పదజాలం ఉపయోగించారని ఆరోపిస్తూ వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డితో పాటు మరో వ్యక్తి ఫిర్యాదు చేయడంతో ఈ నోటీసులు జారీ అయ్యాయి. ప్రసంగాలను పరిశీలించిన ఎన్నికల సంఘం 48 గంటల్లోగా తన వైఖరిని తెలియజేయాలని చంద్రబాబును ఆదేశించింది.