ఆలయంలోకి వచ్చిన నాగుపాము.. ఓ ఆటాడుకున్న పిల్లులు.. ఎక్కడంటే..?

| Edited By: Balaraju Goud

Oct 18, 2024 | 9:54 AM

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని బృందావన చంద్ర ఆలయంలో ఒక పాము కలకలం సృష్టించింది. సమీప పొదల నుంచి ఆలయ ప్రాంగణంలోకి ఒక నాగు పాము ప్రవేశించింది.

ఆలయంలోకి వచ్చిన నాగుపాము.. ఓ ఆటాడుకున్న పిల్లులు.. ఎక్కడంటే..?
Cats With Snake
Follow us on

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని బృందావన చంద్ర ఆలయంలో ఒక పాము కలకలం సృష్టించింది. సమీప పొదల నుంచి ఆలయ ప్రాంగణంలోకి ఒక నాగు పాము ప్రవేశించింది. ఆలయంలోకి వెళ్లే క్రమంలో అక్కడే తిరుగాడుతున్న రెండు పిల్లులు నాగు పామును గమనించాయి. పాము, పిల్లులు ఎదురెదురుగా తారసపడటంతో జాతి వైరoతో అవి కయ్యానికి కాలుదువ్వాయి.

ఆలయంలోకి వచ్చిన నాగుపాము పడగవిప్పి బుసలు కొడుతోంది. ఇంతలో అటుగా వెళుతున్న రెండు పిల్లులు పామును లోపలకి వెళ్ళకుండా ఆటకాయించాయి. ఈ ఘటనను చూసిన మరో నల్ల మచ్చల పిల్లి అక్కడకు చేరుకుంది. మూడు పిల్లులు కలిపి పామును ఆటకాయించాయి. కాసేపు అలా గడిచిపోయాక ఎటువంటి బెదురు లేకుండా నాగుపాము మెల్లగా అక్కడ నుంచి పొదల్లోకి జారుకుంది. దీంతో పిల్లులు చేరోదారి చూసుకున్నాయి. మొత్తానికి చూసే వారందరికీ కాసేపు ఒళ్ళు గగుర్పొడిచింది ఈ దృశ్యం. ఈ ఘటన మొత్తాన్ని స్థానికులు సెల్‌ఫోన్ కెమెరాలలో షూట్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.

వీడియో..

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..