
Andhra News: ప్రజలకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ అందించింది. ప్రభుత్వ పథకాల నగదు అకౌంట్లోకి ఎప్పుడు వస్తాయోనని లబ్దిదారాలు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తూ ఉంటారు. ఎప్పుడు అకౌంట్లోకి పడతాయో తెలియక ఆందోళన పడుతూ ఉంటారు. ఇక నుంచి అలా వేచి చూస్తూ టెన్షన్ పడాల్సిన పని లేదు. ఏ నెలలో ఏ పథకం డబ్బులు ప్రభుత్వం నుంచి వస్తాయనేది ముందే లబ్దిదారులకు తెలిసిపోనుంది. ఏ పథకం డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తాం..? ఏ నెలలో అకౌంట్లో జమ అవుతాయి? అనేది ముందే ప్రభుత్వం వెల్లడించనుంది. ఇందుకోసం ఒక సంక్షేమ క్యాలెండర్‌ను ముందుగానే విడుదల చేయనుంది.
వచ్పే ఆర్ధిక సంవత్సరం నుంచి ఏపీ ప్రభుత్వం సంక్షేమ క్యాలెండర్ అమలు చేయనుంది. అంటే.. ఏ పథకం ఏ నెలలో అమలు చేస్తామనేది ప్రభుత్వం ముందుగానే ఈ క్యాలెండర్ రూపంలో ప్రజలకు తెలియజేయనుంది. పథకాలకు కావాల్సిన నిధులను ముందుగానే రెడీ చేసుకుని ప్రభుత్వం ఫిక్స్ చేసిన నెలలో లబ్దిదారులకు డబ్బులు అందించనుంది. దీని వల్ల లబ్దిదారులకు కూడా డబ్బులు ఎప్పుడు పడతాయనే ఆందోళన కూడా ఉండదు. పథకాలు అందుకునేవారు వేచి చూడాల్సిన అసరం ఉండదు. తమ ఆర్ధిక ప్రణాళికలను దీనిని బట్టి లబ్దిదారులను ప్లాన్ చేసుకోవచ్చు.
సచివాలయంలో సీఎం చంద్రబాబు కలెక్టర్ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంక్షేమ క్యాలెండర్ సిద్దం చేయాలని కలెక్టర్లను చంద్రబాబు ఆదేశించారు. వచ్చే ఆర్ధిక సంవత్సరం నుంచి దానిని అమలు చేయాలని సూచించారు. ఏ పథకం ఏ నెలలో ఇస్తామనేది అందులో స్పష్టంగా పొందుపర్చాలని వివరించారు. సూపర్ సిక్స్ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తామని, ప్రజల్లో కూడా దీనిపై 90 శాతం సంతృప్తి స్థాయి వ్యక్తమైందని అన్నారు. అయితే గతంలో వైసీపీ ప్రభుత్వం సంక్షేమ క్యాలెండర్‌ను అమలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే తరహాలోనే కూటమి ప్రభుత్వం సంక్షేమ క్యాలెండర్ విడుదల చేయనుంది.