Andhra Pradesh: ప్రేమ-పెళ్లి పేరుతో నయవంచన.. నిందితుడికి 10 ఏళ్లు జైలు శిక్ష, జరిమానా!

| Edited By: Balaraju Goud

Feb 22, 2025 | 6:59 PM

తాళ్లరేవు మండలం చిన్న గోవలంక గ్రామానికి చెందిన కాశి మధుబాబు పెద్దల మాట సైతం వినకపోవడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఈ ఫిర్యాదుతో 2019లో ఐ.పోలవరం పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి నుండి కోర్టులో ఈ కేసు వాదోపవాదాలు కొనసాగాయి. చివరికి ముద్దాయి మధుబాబుపై నేరం రుజువుకావడంతో జైలుశిక్ష విధించింది కోర్టు.

Andhra Pradesh: ప్రేమ-పెళ్లి పేరుతో నయవంచన.. నిందితుడికి 10 ఏళ్లు జైలు శిక్ష, జరిమానా!
Jail
Follow us on

అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండలం పశువులంక గ్రామనికి యువతిని ప్రేమిస్తున్నాను,పెళ్లి చేసు కుంటానని నమ్మించాడు. మాయమాటలతో వంచించిన కేసులో ముద్దాయికి 10 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించింది క్రైమ్ ఎగైనెస్ట్ ఉమెన్ కోర్ట్. అంతేకాదు 5 వేల రూపాయలు జరిమానా విధించింది.

ఈ కేసు వివరాలను ముమ్మిడివరం సిఐ మోహన్ కుమార్ వివరించారు. ఐ.పోలవరం మండలం పశువుల్లంక గ్రామ పంచాయతీలో వెల్పేర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న కాశి మధుబాబు అదే గ్రామంలో వాలంటీర్‌గా చేస్తున్న యువతితో ప్రేమ వ్యవహారం నడిపాడు. వాలంటీర్ అయిన యువతని ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని మాయమాటలతో లోబరుచుకున్నాడు. తన కామవాంఛ తీర్చుకుని ముఖం చాటేశాడు. బాధితురాలును పెళ్లి చేసుకోవాలని గ్రామ పెద్దలు సమక్షంలో పంచాయతీ పెట్టారు.

తాళ్లరేవు మండలం చిన్న గోవలంక గ్రామానికి చెందిన కాశి మధుబాబు పెద్దల మాట సైతం వినకపోవడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఈ ఫిర్యాదుతో 2019లో ఐ.పోలవరం పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి నుండి కోర్టులో ఈ కేసు వాదోపవాదాలు కొనసాగాయి. చివరికి ముద్దాయి మధుబాబుపై నేరం రుజువు కావడంతో రాజమండ్రి మేజిస్ట్రేట్ నిందితుడు మధుబాబుకు 10 సంవత్సరాలు కఠిన కారాగార జైలు శిక్ష, రూ. 5,000 జరిమానా విధించారు. ఈ కేసు దర్యాప్తులో కృషి చేసిన పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ బి. కృష్ణారావు అభినందించారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..