
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఏపీ సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. తల్లికి వందనం పథకం కింద విద్యార్థులకు అందిస్తున్న రూ. 15,000 ఆర్థిక సాయాన్ని నేడు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయనుంది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ పథకం కింద రూ. 10,120.78 కోట్లను ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 67,47,190 మంది విద్యార్థులను అర్హులుగా గుర్తించిన ప్రభుత్వం వారి తల్లుల ఖాతాల్లో డబ్బులు వేయనుంది.
అయితే ఈ పథకం కింద ప్రభుత్వం రూ.15వేలు అందజేస్తుండగా.. అందులో రూ.13వేలు విద్యార్థుల సంరక్షకులైన వారి తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేయనుండగా.. మిగతా రూ.2వేలను ఆ విద్యార్థులు చదువుతున్న పాఠశాల అకౌంట్‌లో జమచేయనుంది. అయితే ఈ సారి రెండు విడతల్లో నిధులు విడుదల చేయనుంది ప్రభుత్వం. తొలి విడతలో భాగంగా ఇప్పటికే స్కూల్‌లో చదువుతున్న విద్యార్థుల తల్లుల అకౌంట్‌లో నిధులు జమ చేయనుండగా.. ఇక రెండో విడత కింద ఈ ఏడాది కొత్తగా చేరిన విద్యార్థులకు ఈ పథకాన్ని వర్తింప చేయనున్నారు.ఇవాళ్టి నుంచి మూడు రోజుల లబ్ధిదారుల అకౌంట్లో తల్లికి వందనం నిధులు జమ కానున్నాయి.
తల్లికి వందనం స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.