Andhra Pradesh: నెల్లూరు శివారులో ఘోర రోడ్డు ప్రమాదం.. వీడియో చూస్తే గుండె గుభేల్..!

|

Sep 01, 2022 | 10:20 PM

Andhra Pradesh: నెల్లూరు శివారులో పార్థసారథి నగర్ సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రయాణిస్తున్న వ్యాను..

Andhra Pradesh: నెల్లూరు శివారులో ఘోర రోడ్డు ప్రమాదం.. వీడియో చూస్తే గుండె గుభేల్..!
Cc Visuals
Follow us on

Andhra Pradesh: నెల్లూరు శివారులో పార్థసారథి నగర్ సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రయాణిస్తున్న వ్యాను అదుపుతప్పి బోల్తా పడింది. అలా పల్టీ కొట్టిన వాహనం.. ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొనగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా, ఇద్దరు ఉపాధ్యాయులకు తీవ్ర గాయాలయ్యాయి. మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయి. ఇంతకీ ఏం జరిగిందంటే.. నెల్లూరు నుంచి ముత్తుకూరుకు ప్రభుత్వ ఉపాధ్యాయులతో వెళ్తున్న వ్యాను ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో వ్యానులోని ఇద్దరు ఉపాధ్యాయులకు తీవ్ర గాయాలు కాగా మిగిలిన వారు స్వల్ప గాయాలతో బయటపడి తృటిలో ప్రాణాపాయం నుంచి అందరూ బయటపడ్డారు. వీరంతా ముత్తుకూరు మండలం ఈపురు వెంకన్న పాలెం స్కూల్ కాంప్లెక్స్ పరిధి పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు.

ఇదిలాఉంటే వ్యాను బోల్తా పడ్డ సమయంలో ఎదురుగా వచ్చిన ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తుల్లో ఒకరికి తీవ్రగాయాలుకాగా పరిస్థితి విషమంగా మారింది. వేగంగా వెళుతున్న వ్యానుకు అడ్డంగా ఒక స్కూటీ అకస్మాత్తుగా రావడంతో డ్రైవర్ దానిని తప్పించబోయే క్రమంలో పక్కనే ఉన్న డివైడర్ ను ఢీ కొని అవతలి రోడ్డుపై పల్టీలు కొట్టింది. ఈ సమయంలో ఎదురుగా వచ్చిన బైక్ పై వ్యాను పడింది. బైక్ నుజ్జు నుజ్జు కాగా, దానిపై ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్రగాయాలు అయ్యాయి. స్థానికులు హుటాహుటీన గాయాలతో ఉన్న ఉపాధ్యాయులను అందరినీ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం దృశ్యాలు సీసీ కెమెరాలో చిక్కి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..