Gorantla Butchaiah: బుచ్చయ్య చౌదరిని బుజ్జగించేందుకు త్రిసభ్య బృందం ప్రయత్నం.. ఆయన చెప్పిన మాటతో వెనుతిరిగిన నేతలు!

|

Aug 20, 2021 | 6:26 PM

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరితో అధిష్టాన బృందం చర్చలు ముగిశాయి. చంద్రబాబు ఆదేశాలతో ముగ్గురు నేతలు గోరంట్ల ఇంటికి వెళ్లారు.

Gorantla Butchaiah: బుచ్చయ్య చౌదరిని బుజ్జగించేందుకు త్రిసభ్య బృందం ప్రయత్నం.. ఆయన చెప్పిన మాటతో వెనుతిరిగిన నేతలు!
Tdp Leaders
Follow us on

TDP Leaders meets Gorantla Butchaiah: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరితో అధిష్టాన బృందం చర్చలు ముగిశాయి. చంద్రబాబు ఆదేశాలతో ముగ్గురు నేతలు గోరంట్ల ఇంటికి వెళ్లారు. చిన్నరాజప్ప, జవహర్‌, గద్దె రామ్మోహన్‌ ముగ్గురు కలిసి బుచ్చయ్యతో సమావేశం అయ్యారు. రాజమండ్రి సిటీలో సీనియర్‌ నేత ఆదిరెడ్డి అప్పారావుతో గోరంట్లకు విభేదాలు ఉన్న నేపథ్యంలో వాటి పరిష్కారానికి చర్చలు జరుపుతున్నారు. చంద్రబాబును కలవబోనని, త్వరలోనే అన్నీ చెబుతానని నిన్న ప్రకటించారు బుచ్చయ్య. దీంతో అధిష్టానం ముగ్గురు నేతలను ఆయన ఇంటికి పంపింది. అయితే, రాజీనామాపై బుచ్చయ్య ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది.

బుచ్చయ్యచౌదరితో గంటన్నర పాటు త్రిసభ్య బృందం చర్చలు సాగాయి. సమావేశం అనంతరం టీడీపీ నేత గద్దె రామ్మోహన్‌రావు మీడియాతో మాట్లాడుతూ బుచ్చయ్యచౌదరితో సుదీర్ఘంగా చర్చించామని తెలిపారు. రాజమండ్రి టీడీపీలో ఇబ్బందులపై గోరంట్ల చెప్పారని, ఆయన డిమాండ్లను చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తామని ఆయన అయన అన్నారు. ఈ విషయంపై రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్వయంగా జోక్యం చేసుకుంటారని గద్దె రామ్మోహన్‌రావు పేర్కొన్నారు. త్వరలో పార్టీలో నెలకొన్న విబేధాలు సర్ధుమణుగుతాయని ఆయన వెల్లడించారు.

బుచ్చయ్యచౌదరి పార్టీ అధిష్ఠానం తీరుపై గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు. దీంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇదే క్రమంలో తన ఎమ్మెల్యే పదవికి, పార్టీ పదవికి వారం రోజుల్లో రాజీనామా చేస్తానని సన్నిహితుల వద్ద చెప్పడం పార్టీలో కలకలం రేపింది. తక్షణమే రంగంలోకి దిగిన టీడీపీ అధినేత చంద్రబాబు ఆయనకు ఫోన్‌చేసి 20 నిమిషాలు మాట్లాడారు. చంద్రబాబు ఆదేశాలతో బుచ్చయ్యచౌదరిని బుజ్జగించేందుకు టీడీపీ త్రిసభ్య బృందం ఆయనను కలిసింది. టీడీపీ బృందంలో మాజీమంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, జవహర్‌, గద్దె రామ్మోహన్‌ ఉన్నారు. రాజమండ్రి అర్బన్‌లో బుచ్చయ్యచౌదరి చెబుతున్న పేర్లను పరిశీలనలోకి తీసుకోవడంతో పాటు ఆదిరెడ్డి అప్పారావు, బుచ్చయ్యచౌదరి మధ్య విభేదాలను తొలగించాలని టీడీపీ హైకమాండ్‌ ఆదేశించింది.

Read Also…  అయ్యో పాపం పెద్దాయన.. ఎంతపనైపోయింది..? డాన్స్ చేస్తుండగా జారిపోయిన ప్యాంటు..:Viral Video.