TDP vs YCP: ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కి టీడీపీ అధినే చంద్రబాబు లేఖ రాశారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం సహా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్యాలయాలపై వైసీపీ శ్రేణులు దాడులు చేయడంపై ఫిర్యాదు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయ్యిందని లేఖలో ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీ ఆఫీసులు, నేతలపై దాడులు చేస్తున్నారని చంద్రబాబు తన లేఖలో గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో ఆర్టికల్ 356ని విధించాలని, ఆ మేరకు కేంద్రానికి సిఫారసులు పంపించాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ని చంద్రబాబు కోరారు. టీడీపీ కార్యాలయాలు, టీడీపీ నేతలపై జరిగిన దాడులపై సీబీఐతో విచారణ జరిపించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. అలాగే, ప్రతిపక్ష పార్టీల ఆఫీస్ లకు కేంద్ర బలగాలచే రక్షణ కల్పించాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు.
తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు, పార్టీ నేతలపై వైసీపీ శ్రేణులు దాడులకు తెగబడటాన్ని నిరసిస్తూ మంగళగిరిలోని టీడీపీ ఆఫీసులో ఆ పార్టీ అధినేత చంద్రబాబు 36 గంటల పాటు నిరవధిక నిరసన దీక్షకు దిగిన విషయం తెలిసిందే. ఈ సమయంలోనే ఆయన గవర్నర్‌కు లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు. వైసీపీ నేతలు, కార్యకర్తలు రౌడీల్లా ప్రవర్తిస్తూ ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలపై దాడులకు తెగబడుతున్నారని ఫైర్ అయ్యారు. ఇదే అంశంపై భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సహా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కు కూడా లేఖ రాశారు. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని, కేంద్ర బలగాలచే ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యాలయాలకు రక్షణ కల్పించాలని కోరారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ చేయబడుతోందంటూ సంచలన ఆరోపణలు చేశారు.
Also read: