సింహాచలం ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు..

ఈ ఘటనలో ఏడుగురు భక్తులు మృతి చెందారు. మరో 10 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. శిథిలాల కింద మరికొందరు ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల్లో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. సంఘటన ప్రదేశానికి చేరుకున్న రెస్క్యూ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టారు.

సింహాచలం ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు..
Telangana Cm Revanth Reddy

Updated on: Apr 30, 2025 | 8:08 AM

సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి చందనోత్సవంలో జరిగిన ప్రమాదం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చందనోత్సవం వేళ అప్పన్న సన్నిధిలో భక్తులు మరణించిన ఘటన తీవ్ర ఆవేదనను కలిగించిందన్నారు. భారీ వర్షాల కారణంగా గోడ కూలడంతో జరిగిన ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మృతి చెందిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్‌లోని సింహాచలంలో ఘోర ప్రమాదం జరిగింది. చందనోత్సవం వేళ అప్పన్న సన్నిధిలో అపశృతి చోటు చేసుకుంది. రూ. 300 టికెట్ కౌంటర్ దగ్గర గాలి, వానకు గోడ కూలిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు భక్తులు మృతి చెందారు. మరో 10 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. శిథిలాల కింద మరికొందరు ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల్లో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. సంఘటన ప్రదేశానికి చేరుకున్న రెస్క్యూ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టారు. ఘటనా స్థలానికి చేరుకున్న హోంమంత్రి అనిత, జిల్లా కలెక్టర్ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కాగా, మృతదేహాలను కేజీహెచ్‌ ఆస్పత్రికి తరలిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..