Weather Alert: మరో బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఇదిగో 3 రోజుల వెదర్ రిపోర్ట్..

దిత్వా తుఫాను ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి.. ఈ క్రమంలో వాతావరణ శాఖ వచ్చే మూడు రోజులు.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో వాతావరణం, వర్షాలపై కీలక అప్డేట్ ఇచ్చింది. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. నిన్నటి రోజున ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి తీరాలు, పరిసర ప్రాంతాలలో నున్న వాయుగుండం ఈరోజు అల్పపీడనంగా అదే ప్రాంతంలో కొనసాగింది.

Weather Alert: మరో బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఇదిగో 3 రోజుల వెదర్ రిపోర్ట్..
Rain Alert

Updated on: Dec 03, 2025 | 5:42 PM

దిత్వా తుఫాను ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి.. ఈ క్రమంలో వాతావరణ శాఖ వచ్చే మూడు రోజులు.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో వాతావరణం, వర్షాలపై కీలక అప్డేట్ ఇచ్చింది. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. నిన్నటి రోజున ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి తీరాలు, పరిసర ప్రాంతాలలో నున్న వాయుగుండం ఈరోజు, డిసెంబర్ 03, 2025 ఉదయం 0830 గంటలకు బాగా గుర్తించబడిన అల్పపీడనంగా అదే ప్రాంతంలో కొనసాగింది. సంబంధిత ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కి.మీ ఎత్తులో విస్తరించి ఉంది. ఇది ఉత్తర తీరప్రాంత తమిళనాడు – పుదుచ్చేరి మీదుగా నైరుతి దిశగా నెమ్మదిగా కదులుతూ, రాబోయే 24 గంటల్లో అల్పపీడన ప్రాంతంగా మరింత బలహీనపడే అవకాశం ఉంది.

ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి తీరాలాలో నున్న బాగా గుర్తించబడిన అల్పపీడన ప్రాంతము – పరిసర ప్రాంతాల నుండి ఉత్తర అంతర తమిళనాడు, దక్షిణ అంతర కర్ణాటక, ఉత్తర కేరళ మీదుగా లక్షద్వీప్ ప్రాంతం వరకు ద్రోణి సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉంది.

వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు:-

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం:-

బుధవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 30-40 కీ.మీ గరిష్టముగా 50 కీ.మీ వేగముతో వీచే అవకాశముంది.

గురువారం వర్షాలు..

గురువారం, శుక్రవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ప్రకాశం, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్:-

బుధవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. భారీ నుండి అతి భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 30-40 కి.మీ గరిష్టముగా 50 కీ.మీ వేగముతో వీచే అవకాశముంది.

గురువారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

శుక్రవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.

రాయలసీమ:-

తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ విశ్లేషణ – వాతావరణ హెచ్చరికలు:

తెలంగాణలో కూడా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈరోజు రాష్ట్రంలోని కొన్ని దక్షిణ జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. గురువారం, శుక్రవారం రాష్ట్రంలోని పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..