
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి.. పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో దాదాపు 34 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.. మున్ముందు ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లోని వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. దాదాపు పొడి వాతావరణం ఏర్పడే అవకాశముందని.. పొగమంచు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని పేర్కొంది. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. ఉత్తర ఒడిశా నుండి దక్షిణ ఛత్తీస్‌గఢ్ మీదుగా విదర్భ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ద్రోణి విస్తరించి కొనసాగుతోంది. వాయువ్య తమిళనాడు నుండి మరఠ్వాడ వరకు నిన్నటి ఉత్తర-దక్షిణ ద్రోణి/గాలి అంతరాయం ఇప్పుడు మన్నార్ గల్ఫ్ & పొరుగు ప్రాంతాల మీదుగా ఉపరితల ఆవర్తనం నుండి తమిళనాడు & అంతర కర్ణాటక మీదుగా మరఠ్వాడ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో విస్తరించినది.
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ – యానములో దిగువ ట్రోపో ఆవరణములో వాయువ్య గాలులు వీస్తున్నాయి. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమలో దిగువ ట్రోపో ఆవరణములో దక్షిణ / నైరుతి గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఈ కింది విధంగా ఉన్నాయి.
మంగళవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశముంది. పొగమంచు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
బుధవారం, గురువారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశముంది.
మంగళవారం, బుధవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశముంది. పొగమంచు ఒకటి లేదా రెండు చోట్ల కురసే అవకాశముంది.
గురువారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశముంది.
గమనిక :- రాగల 5 రోజుల్లో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ – యానములో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదులో గణనీయమైన మార్పు లేదు. రాగల 24 గంటల్లో దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదులో గణనీయమైన మార్పు లేదు, తదుపరి గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమముగా పెరిగే అవకాశముంది.
హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. ఉత్తర దక్షిణ గాలి విచ్చితి / ద్రోణి ఈరోజు గల్ఫ్ ఆఫ్ మన్నార్ ప్రాంతంలోని ఉపరితల చక్రవాత ఆవర్తనం నుండి తమిళనాడు, అంతర్గత కర్ణాటక మీదుగా మరాత్వాడ ప్రాంతం వరకు సగటు సముద్ర మట్టం నుండి 0.9 కి మీ ఎత్తులో కొనసాగుతోంది. మరియొక ద్రోణి ఉత్తర ఒడిశా నుండి దక్షిణ ఛత్తీస్గడ్ మీదుగా విదర్భ ప్రాంతం వరకు సగటు సముద్రమట్టం నుండి 0.9 కి మీ ఎత్తులో ఏర్పడింది. రాగల 3 రోజులకు వాతావరణ సూచనలు ఈ కింది విధంగా ఉన్నాయి.
మంగళవారం, బుధవారం, గురువారం తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. రాగల మూడు, నాలుగు రోజులలో రాష్ట్రంలోనీ కొన్ని ప్రాంతాలలో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమేపీ రెండు నుంచి మూడు డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..