
పులివెందులలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. జడ్పీటీసీ ఉపఎన్నికలో టీడీపీ విన్ అయ్యింది. దాదాపు 6వేల 52 ఓట్ల మెజార్టీతో టీడీపీ అభ్యర్థి లతారెడ్డి ఘన విజయం సాధించారు. ఈ ఎన్నికలో టీడీపీకి 6735 ఓట్లు వచ్చాయి. వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి కేవలం 683 ఓట్లు వచ్చాయి. దీంతో వైసీపీ డిపాజిట్ కోల్పోయింది. ఈ స్థానంలో మొత్తం 10వేల601 ఓట్లు ఉండగా.. 7814 ఓట్లు పోల్ అయ్యాయి. సొంత ఇలాకాలో వైసీపీ ఓటమి జగన్‌కు షాక్ అని చెప్పొచ్చు. 30 ఏళ్ల తర్వాత పులివెందుల జడ్పీ పీఠం టీడీపీ వశమైంది. 2016 కంటే ముందు ఐదుసార్లు వైఎస్ ఫ్యామిలీ నిలబెట్టిన అభ్యర్థే ఏకగ్రీవంగా ఎన్నికవుతూ వచ్చారు. ఇక 2016 జడ్పీటీసీ ఎన్నికలో టీడీపీ అభ్యర్థి నామినేషన్ తర్వాత వైసీపీలో చేరారు. అయితే బ్యాలెట్ పేపర్‌లో సైకిల్ గుర్తు ఉండడంతో దానికి 2500 ఓట్లు పడడం గమనార్హం.
కాగా ఈ ఎన్నికను రెండు పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. గెలుపు కోసం వ్యూహ ప్రతివ్యూహాలను రచించాయి. ఈ ఎన్నిక ఒక మినీ సంగ్రామాన్ని తలపించింది. గొడవలు, అరెస్టులు, రీపోలింగ్ వంటివి జరిగాయి. వైసీపీ కంచుకోటను బద్దలు కొట్టాలని టీడీపీ, పట్టు నిలుపుకోవాలని టీడీపీ ప్రణాళికలు రచించాయి. ఎన్నికలకు ముందు నుంచే తమ ప్లాన్స్ అమలుచేశాయి. చివరకు టీడీపీ అనుకున్నది సాధించింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి