YCP Vs TDP: గుడివాడ వేదికగా వైసీపీ వర్సెస్ టీడీపీ.. ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా పోటా పోటీ సభలు..

గుడివాడ సెంటర్‌లో సై అంటే సై అంటున్నాయ్‌ టీడీపీ, వైసీపీ. నీ పతాపమో మా పతాపమో చూసుకుందాం రా అన్నట్టుగా తలపడుతున్నారు ఇరు పార్టీల నేతలు. కొడాలి నాని టార్గెట్‌గా టీడీపీ కాలుదువ్వుతుంటే.. నాకేం తక్కువంటూ కౌంటర్‌ వార్‌ స్టార్ట్‌ చేశారు కొడాలి. దాంతో, గుడివాడలో పొలిటికల్‌ మీటర్‌.. థౌజండ్‌ వాట్స్‌ను దాటేసి సెగలు రేపుతోంది. ఒకవైపు చంద్రబాబు, ఇంకోవైపు కొడాలి నాని.. పోటాపోటీ సభలతో గుడివాడలో ఒక్కసారిగా హీట్‌ పెంచేశారు.

Ntr's Death Anniversary

Updated on: Jan 18, 2024 | 11:23 AM

గుడివాడ సెంటర్‌లో సై అంటే సై అంటున్నాయ్‌ టీడీపీ, వైసీపీ. నీ పతాపమో మా పతాపమో చూసుకుందాం రా అన్నట్టుగా తలపడుతున్నారు ఇరు పార్టీల నేతలు. కొడాలి నాని టార్గెట్‌గా టీడీపీ కాలుదువ్వుతుంటే.. నాకేం తక్కువంటూ కౌంటర్‌ వార్‌ స్టార్ట్‌ చేశారు కొడాలి. దాంతో, గుడివాడలో పొలిటికల్‌ మీటర్‌.. థౌజండ్‌ వాట్స్‌ను దాటేసి సెగలు రేపుతోంది. ఒకవైపు చంద్రబాబు, ఇంకోవైపు కొడాలి నాని.. పోటాపోటీ సభలతో గుడివాడలో ఒక్కసారిగా హీట్‌ పెంచేశారు.

రా కదలిరా’ పేరుతో చంద్రబాబు భారీ బహిరంగసభ నిర్వహిస్తుంటే.. పోటీగా ఎన్టీఆర్‌ వర్థంతి సభకు ప్లాన్‌ చేశారు కొడాలి నాని. ఎన్టీఆర్‌ స్టేడియంలో పెద్దఎత్తున అన్నదాన కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్నారు కొడాలి. దాంతో, గుడివాడలో ఇంతకుముందెన్నడూ లేనివిధంగా రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఒకే రోజు, ఒకే టైమ్‌లో నిర్వహిస్తోన్న పోటాపోటీ సభలతో గుడివాడలో వార్‌ పీక్స్‎కి చేరింది. టీడీపీ, వైసీపీ ఫ్లెక్సీలతో గుడివాడ పట్టణం మొత్తం నిండిపోయింది. ఏ దిక్కున చూసినా పోటాపోటీ ఫ్లెక్సీలే కనిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..