Payyavula Keshav: పొలం బాట పట్టిన ఎమ్మెల్యే.. రైతుగా మారి వేరుశనగ తోటలో కలుపు తీసిన టీడీపీ నేత

|

Sep 13, 2021 | 9:02 AM

Payyavula Keshav Turns As a Farmer:  2019 లో ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ గాలి వీస్తున్న సమయంలో కూడా టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి.. విజయబావుటా ఎగరవేశారు పయ్యావుల కేశవ్.  తాజాగా అనంతరపురం జిల్లా..

Payyavula Keshav: పొలం బాట పట్టిన ఎమ్మెల్యే..  రైతుగా మారి వేరుశనగ తోటలో కలుపు తీసిన టీడీపీ నేత
Payyavala Keshav
Follow us on

Payyavula Keshav Turns As a Farmer:  2019 లో ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ గాలి వీస్తున్న సమయంలో కూడా టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి.. విజయబావుటా ఎగరవేశారు పయ్యావుల కేశవ్.  తాజాగా అనంతరపురం జిల్లా ఉరవకొండ ఎమ్మెల్యే, పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ ఛైర్మన్‌ పయ్యావుల కేశవ్‌ పొలం బాట పట్టారు. రైతుగా మారిన కేశవ్ . తన స్వగ్రామం కౌకుంట్ల పొలాల్లో వరి పైరు నాటేందుకు భూమిని సిద్ధం చేశారు.  పొలంలో ట్రాక్టర్ తో బురద మడక తోలారు. అనంతరం వేరుశెనగ కలుపు తీస్తూ తోటి రైతులతో సరదాగా గడిపారు.  ఓ వైపు రాజకీయ నాయకుడిగా ఎమ్మెల్యేగా ప్రజల సమస్యలపై అసెంబ్లీలో పోరాటం చేస్తున్న పయ్యావుల కేశవ్.. ఇపుడు ఇలా పొలంలో సేద్యం చేయడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఉరవకొండ మండలం కౌకుంట్ల గ్రామానికి చెందిన పయ్యావుల కేశవ్ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు. ఎంబిఎ చదివాడు. . 1994, 2004, 2009 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయాలు సాధించాడు. 2014లో ఓటమి పాలయ్యారు. ఇక మళ్లీ వైసీపీ ప్రభంజనం సృష్టిస్తున్న సమయంలో ఎంతోమంది హేమామీలు ఓటమిపాలైనప్పుడు  2019 ఎన్నికల్లో ఉరవకొండ నుంచి 4000 ఓట్ల మేజరిటీతో  మళ్ళీ ఎమ్మెల్యే గా గెలిచారు.  అయితే వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన పయ్యావుల కేశవ్.. తన మూలాలు మర్చిపోలేదంటూ ఆనందపడుతున్నారు రైతులు.

Payyavala Keshav 1

Also Read:  15 ఏళ్ళు కూడా లేని ఈ అన్నా చెలెల్లు.. నెలసరి సంపాదన రూ 23 లక్షలు.. ఇప్పుడు ప్రపంచంలోనే ఫేమస్..

Inspiring Story: నేటి తరానికి ఆదర్శమూర్తి సుధా మూర్తి.. ప్రతి ఏడాది 3 రోజులు ప్రసాదానికి కూరగాయలు కట్ చేస్తారని తెలుసా..