Garapati Sambasiva Rao: మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత సాంబశివరావు మృతి.. చంద్రబాబు సహా పలువురు సంతాపం..

Garapati Sambasiva Rao: గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌ నేత గారపాటి సాంబశివరావు(75)( Garapati Sambasiva Rao) ఈరోజు ఉదయం తుది శ్వాస విడిచారు. .

Garapati Sambasiva Rao: మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత సాంబశివరావు మృతి.. చంద్రబాబు సహా పలువురు సంతాపం..
Tdp Senior Leader Garapati

Updated on: Feb 02, 2022 | 4:57 PM

Garapati Sambasiva Rao: గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌ నేత గారపాటి సాంబశివరావు(75)( Garapati Sambasiva Rao) ఈరోజు ఉదయం తుది శ్వాస విడిచారు. పశ్చిమ గోదావరి జిల్లా(West Godavari District) పెదపాడు మండలం నాయుడుగూడెంలోని ఆయన స్వగృహంలో మరణించారు. అనారోగ్యంతో బాధపడుతున్న సాంబశివరావు గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటూ.. విశ్రాంతి తీసుకుంటున్నారు.

సాంబ‌శివ‌రావు మృతికి టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చంద్రబాబు సహా సహా పలువురు నేతలు సంతాపం తెలిపారు. గారపాటి సాంబశివరావు  మరణం విచారకరకరమని చంద్రబాబు ట్విట్టర్ వేదికగా సంతాపం ప్రకటించారు. అంతేకాదు ప్రజల్లో ఎంతో ఆదరణ కలిగిన సాంబశివరావు దెందులూరు నుంచి నాలుగుసార్లు శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. మంత్రిగా కూడా పనిచేసి తనదైన ముద్రవేశారు. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని చంద్ర‌బాబు నాయుడు ట్విట్టర్ లో పేర్కొన్నారు.

మరోవైపు నారా లోకేష్ కూడా ట్విట్టర్ వేదికగా సాంబశివరావు  మృతి సంతాపం తెలియజేశారు. టిడిపి సీనియర్ నేత, మాజీమంత్రి గారపాటి సాంబశివరావు గారి మృతి బాధాకరం. ప్రజలకి నిస్వార్థంగా సేవలు అందించి, నియోజకవర్గ అభివృద్ధికి కృషిచేసి చిరస్మరణీయులుగా నిలిచారు. సాంబశివరావు గారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానని ట్విట్టర్ లో పేర్కొన్నారు.

సాంబశివరావు భౌతిక కాయాన్ని పలువురు టీడీపీ నేతలు సందర్శించి నివాళులు అర్పించారు. ఆయన కుటుంబానికి సంతాపం తెలిపారు.

Also Read: