Chandrababu Naidu: అమిత్ షా, నడ్డాతో చంద్రబాబు నాయుడు సమావేశం.. వాటి గురించే చర్చలా ?

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. శనివారం మధ్యాహ్నం దిల్లీ చేరుకున్న చంద్రబాబు.. రాత్రి 8 గంటల సమయంలో అమిత్‌ షా నివాసంలో జేపీ నడ్డా షాను కలిశారు.

Chandrababu Naidu: అమిత్ షా, నడ్డాతో చంద్రబాబు నాయుడు సమావేశం.. వాటి గురించే చర్చలా ?
Amit Shah And Chandra Babu Naidu

Updated on: Jun 03, 2023 | 10:00 PM

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. శనివారం మధ్యాహ్నం దిల్లీ చేరుకున్న చంద్రబాబు.. రాత్రి 8 గంటల సమయంలో అమిత్‌ షా నివాసంలో జేపీ నడ్డా షాను కలిశారు. చంద్రబాబు దిల్లీ పర్యటన ప్రైవేటు కార్యక్రమమని పార్టీ వర్గాలు చెప్పగా.. మరోవైపు తెలుగురాష్ట్రాల్లో బీజేపీతో టీడీపీ పొత్తలపైనే ప్రధాన చర్చ ఉంటుందని పలువులు భావిస్తున్నారు. ఏపీలో పొత్తులు, తెలంగాణలో ఒంటరి పోరు ఉండేలా ప్రతిపాదనలు చేయనున్నట్లు సమాచారం. అయితే బీజేపీ పొత్తు కోసం టీడీపీ చాలాకాలంగా రాయబారాలు నడుపుతోంది.

ఇదిలా ఉండగా 2019 ఎన్నికల తర్వాత ఆజాది కా అమృత్‌ మహోత్సవ్‌ సమయంలో ఒకసారి ప్రధాని మోదీని చంద్రబాబు నాయుడు కలిశారు. ఆ తర్వాత జీ20 సన్నాహక సదస్సుకు హాజరయ్యేందుకు దిల్లీ వెళ్లినప్పుడు మరోసారి సమావేశమయ్యారు. ఇప్పుడు మళ్లీ తాజాగా చంద్రబాబు జేపీ నడ్డా, అమిత్ షాతో భేటీ కావడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి