Yuva Galam Padayatra: వాయిదా పడిన నారా లోకేశ్ యువగళం పాదయాత్ర.. కారణం ఇదే..
Lokesh Yuva Galam Padayatra: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర మరోసారి వాయిదా పడింది. ఈ రాత్రికి రాజోలు నుంచి యాత్రను లోకేష్ పునఃప్రారంభిస్తారని టీడీపీ వర్గాలు తెలిపాయి. కాని, అక్టోబర్ మూడున సుప్రీంకోర్టులో స్కిల్ డెవలప్‌మెంట్ కేసు విచారణ ఉండటంతో పాదయాత్రను వాయిదా వేసుకోవాలని పార్టీ ముఖ్యనేతలు సూచించడంతో దానికి లోకేష్ అంగీకరించారు. కోర్టు కేసులు, తాజా పరిణామాలు చూసిన తర్వాత పాదయాత్ర పునః ప్రారంభ తేదీని ప్రకటిస్తామని టీడీపీ వర్గాలు తెలిపాయి.

యువగళం పాదయాత్రను తెలుగు దేశంపార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ వాయిదా వేసుకున్నారు. సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు విచారణకు రానున్న క్రమంలో ప్రస్తుతానికి యాత్రను వాయిదా వేసుకోవాలని నిర్ణయించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర మరోసారి వాయిదా పడింది. ఈ రాత్రికి రాజోలు నుంచి యాత్రను లోకేష్ పునఃప్రారంభిస్తారని టీడీపీ వర్గాలు తెలిపాయి. కాని, అక్టోబర్ మూడున సుప్రీంకోర్టులో స్కిల్ డెవలప్‌మెంట్ కేసు విచారణ ఉండటంతో పాదయాత్రను వాయిదా వేసుకోవాలని పార్టీ ముఖ్యనేతలు సూచించడంతో దానికి లోకేష్ అంగీకరించారు. కోర్టు కేసులు, తాజా పరిణామాలు చూసిన తర్వాత పాదయాత్ర పునః ప్రారంభ తేదీని ప్రకటిస్తామని టీడీపీ వర్గాలు తెలిపాయి.
ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న లోకేష్, కేసులకు సంబంధించి న్యాయనిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి చంద్రబాబు అరెస్టు వ్యవహారాన్ని ఆమె దృష్టికి తీసుకెళ్లారు. ఢిల్లీ నుంచే ఆయన పార్టీ ముఖ్యనేతలతో చర్చలు జరుపుతున్నారు.
సెప్టెంబర్ 9న చంద్రబాబును అరెస్టు చేయడంతో తూర్పు గోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలో ఉన్న లోకేష్ తన పాదయాత్రను నిలిపేసి హుటాహుటిన విజయవాడ వచ్చారు. చంద్రబాబును రాజమండ్రి జైలుకు తరలించడంతో అక్కడే కొన్నాళ్లు లోకేష్ ఉన్నారు. ఆ తర్వాత ఆయన ఢిల్లీకి వచ్చారు.
క్వాష్ పిటిషన్‌పై అక్టోబర్ 3న సుప్రీంలో విచారణ
ఇదిలావుంటే, చంద్రబాబు కేసులో పక్కా వ్యూహంతో వ్యవహరిస్తోంది ఏపీ ప్రభుత్వం. బాబును ఇరుకున పెట్టేందుకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్నీ జగన్ సర్కార్ వదిలిపెట్టడం లేదు. చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై అక్టోబర్ 3న సుప్రీంలో విచారణ జరగనున్న నేపథ్యంలో.. ఏపీ ప్రభుత్వం తాజాగా కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. అసలు కేవియట్ పిటిషన్ అంటే ఏంటి ? దీనివల్ల చంద్రబాబుకు వచ్చే ఇబ్బందులేంటి?
సుప్రీంకోర్టు తీర్పు ఏ విధంగా ఉంటుందో..
మరోవైపు చంద్రబాబు స్కిల్‌స్కామ్ కేసుతో పాటు ఏపీ ఫైబర్ గ్రిడ్ , అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్, అంగళ్లు ఘర్షణకు సంబంధించిన కేసులు కూడా ఉన్నాయి. దీంతో చంద్రబాబుకు ఒక కేసులో ఊరట లభించినా మరో కేసులో ఇరుకున పెట్టాలని ప్రభుత్వం ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. సుప్రీంకోర్టులో శుభవార్త వస్తుందని ఆశిస్తున్న టీడీపీ శ్రేణులకు..ప్రభుత్వం దాఖలు చేసిన కేవియట్ పిటిషన్ షాక్ ఇచ్చిందనే చెప్పాలి. మరి దీనిపై సుప్రీంకోర్టు తీర్పు ఏ విధంగా ఉంటుందో చూడాలి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
