‘నా జోలికొస్తే.. మంత్రం వేసి మాయం చేస్తా’.. టీడీపీ యువనేత మాస్ వార్నింగ్..!
'నా జోలికి వస్తే నీ అంతు చూస్తా'.. 'నీ సంగతి ఏంటో తేలుస్తా'.. 'నీ అడ్రస్ గల్లంతు చేస్తా'.. అని వార్నింగ్ ఇచ్చే రాజకీయ నాయకులను మీరు చూసి ఉంటారు. కానీ టీడీపీ యువనేత పరిటాల శ్రీరామ్ రూటే సెపరేట్. 'మ్యాజిక్ చేసి.. మంత్రం వేసి.. మాయం చేస్తా' అంటూ ప్రత్యర్థులపై వ్యంగ్యంగా మాట్లాడుతూనే సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
‘నా జోలికి వస్తే నీ అంతు చూస్తా’.. ‘నీ సంగతి ఏంటో తేలుస్తా’.. ‘నీ అడ్రస్ గల్లంతు చేస్తా’.. అని వార్నింగ్ ఇచ్చే రాజకీయ నాయకులను మీరు చూసి ఉంటారు. కానీ టీడీపీ యువనేత పరిటాల శ్రీరామ్ రూటే సెపరేట్. ‘మ్యాజిక్ చేసి.. మంత్రం వేసి.. మాయం చేస్తా’ అంటూ ప్రత్యర్థులపై వ్యంగ్యంగా మాట్లాడుతూనే సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ‘మీ స్కూల్లో తిక్క మాటలు మాట్లాడటం నేర్పించారు. మాకూ ఒక స్కూల్ ఉంది. అందులో నాకు మ్యాజిక్ నేర్పించారు’.
” నేను మ్యాజిక్ చేసి… మంత్రం వేసి మాయం చేస్తా.. కాకపోతే నాకు మ్యాజిక్ సగమే నేర్పించారు మా స్కూల్‌లో. మాయం చేసిన తర్వాత తిరిగి తీసుకురావడం నేర్పించలేదు. కాబట్టి నేను మంత్రం వేసే పరిస్థితి తెచ్చుకోవద్దంటూ ప్రత్యర్ధులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు పరిటాల శ్రీరామ్. ఆ మంత్రం చాలా భయంకరంగా ఉంటుంది. మా స్కూల్‌లో నేర్పించిన విధానం వేరుగా ఉందంటూ పరిటాల శ్రీరామ్ చేసిన ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి. మొత్తానికి రాబోయే ఎన్నికల్లో ప్రత్యర్ధులపై పరిటాల శ్రీరామ్ ఏదో కనికట్టు చేసేందుకు రెడీ అవుతున్నట్టున్నారుగా అని స్థానిక నేతలు చెవులు కొరుక్కుంటున్నారు.
బిర్యానీ కోసం ఆశగా లోపలి వెళ్ళాడు.. తిని బయటకి రాగానే ??
సందర్శకులను కట్టి పడేస్తున్న అరుదైన పుష్పాల ఫ్లవర్ షో
ఓర్నీ.. ఈ పాము ట్యాలెంట్ మామూలుగా లేదుగా
కొబ్బరిచెట్టుపై కాయలు కోస్తున్న కోతి.. నెట్టింట వీడియో వైరల్
కొవిడ్ తరహా స్క్రీనింగ్.. ఆ ఎయిర్‌పోర్టుల్లో మళ్ళీ మొదలు
పనిచేస్తున్న ఇంట్లోనే చోరీ.. రూ.18 కోట్ల బంగారం దోచుకెళ్లారు
పోలీసులమంటూ బంగారం దోపిడి.. పాలమూరులో నయా ముఠా

