కేంద్ర మంత్రికి లోకేశ్ లేఖ.. ఆదుకోకుండా భారం మోపడం ఏమిటని ప్రశ్న

|

Mar 05, 2022 | 8:46 PM

చేనేత రంగానికి భారంగా మారిన జీఎస్టీ పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతూ.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌(Nirmala Seetharaman)కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(Nara Lokesh) లేఖ రాశారు....

కేంద్ర మంత్రికి లోకేశ్ లేఖ.. ఆదుకోకుండా భారం మోపడం ఏమిటని ప్రశ్న
Lokesh
Follow us on

చేనేత రంగానికి భారంగా మారిన జీఎస్టీ పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతూ.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌(Nirmala Seetharaman)కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(Nara Lokesh) లేఖ రాశారు. ముడిసరుకులపైనా 25శాతం మేర పన్ను పెంచినందున రంగులు, రసాయనాలు, నూలు ధరలు, రవాణా ఖర్చులు పెరిగి పోయాయన్నారు. చేనేత ఉత్పత్తులపై ఐదు శాతమే భారం అనుకుంటే.. ఇప్పుడు దాన్ని 12శాతానికి పెంచడమేంటని లేఖలో ప్రశ్నించారు. కరోనాతో సంక్షోభంలో కూరుకుపోయిన చేనేత పరిశ్రమను(Hand Loom Industry) ఆదుకోకుండా ఇలా భారం పెంచడం సరికాదని సూచించారు. రాయితీలు, రుణాలు అందజేసి వారిని ఆదుకోవాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యక్షంగా, పరోక్షంగా 65 లక్షల మంది చేనేత రంగం పై ఆధారపడి జీవిస్తున్నారని లేఖలో వివరించారు. దేశ వస్త్ర రంగంలో ఆంధ్రప్రదేశ్ చేనేతకు ప్రత్యేక స్థానం ఉందని గుర్తు చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వ చిన్నచూపు, కరోనా కారణంగా చేనేత రంగం పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. చేనేత రంగానికి అండగా నిలిచిన సంక్షేమ కార్యక్రమాలు, సబ్సీడీలు, తక్కువ వడ్డీకే రుణాలు, ఆప్కో ద్వారా కొనుగోళ్లు, నేతన్నలకు ప్రోత్సాహకాలు లాంటి అనేక కార్యక్రమాలను అమలు చెయ్యకపోవడంతో చేనేత రంగం తీవ్ర ఇబ్బందులు పడుతోందని లేఖలో ప్రస్తావించారు. జాతిపిత మహాత్మాగాంధీ మెచ్చిన పొందూరు ఖద్దరు, కళాత్మకత ఉట్టిపడే ఉప్పాడ చీరలు, మంగళగిరి పట్టు చీరలు ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచాయని వివరించారు.

Also Read

Manipur Elections: మణిపూర్‌లో ముగిసిన తుది విడత పోలింగ్.. పలుచోట్ల హింసాత్మక ఘటనలు!

Singer Chinmayi: ఆ విషయంపై మా అమ్మను ఇబ్బంది పెట్టకండి.. సోషల్‌ మీడియాలో చిన్మయి ఇంట్రెస్టింగ్‌ పోస్ట్‌..

పెంపుడు కుక్కకు గ్రాండ్‌గా సీమంతం.. అదిరిపోయే వంటకాలు, ఆహారపదార్థాలు.. ఆశ్చర్యపోయిన జనం..