ఏపీలో తెలుగు దేశం పార్టీని మళ్లీ అధికారంలోకి తెచ్చేందుకు ఆ పార్టీ అగ్రనేతలు, కార్యకర్తలు నిత్యం పాటు పడుతునే ఉన్నారు. తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర చేపట్టి ప్రజల్లోకి మరింత చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. తెదేపా అధికారంలోకి వచ్చిన వెంటనే కర్నూల్‌లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఇటీవల హామీ ఇచ్చారు. అయితే ఈ పాదయాత్రలో భాగంగా కర్నూలులోని జిల్లా కోర్టు భవనం వద్దకు చేరుకున్న ఆయనకు పలువురు న్యాయవాదులు సంఘీబావం తెలిపారు.
ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ తాము సీఎం జగన్ లాగా మాట మార్చి, మడమ తిప్పే బ్యాచ్ కాదన్నారు. కర్నూల్‌లో కచ్చింతంగా హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసి తీరుతామని స్పష్టం చేశారు. ఆయన చేసిన హామీపై న్యాయవాదులు కృతజ్ఞతలు తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం