Buddha Venkanna: 37 కేసులు ఉన్నాయ్.. ఏమీ చేయలేకపోతున్నా.. టీడీపీ నేత బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు..

|

Aug 03, 2024 | 12:11 PM

పదవి లేకపోవడంతో ఏమీ చేయలేకపోతున్నా.. సీఐల బదిలీల విషయంలో నా మాట చెల్లలేదు.. సీఐల ట్రాన్స్‌ఫర్స్‌ విషయంలో MLAల మాట నెగ్గింది.. ప్రస్తుతం నేను ఇతరులపై ఆధారపడ్డా.. అంటూ టీడీపీ నేత బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు.

Buddha Venkanna: 37 కేసులు ఉన్నాయ్.. ఏమీ చేయలేకపోతున్నా.. టీడీపీ నేత బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు..
Buddha Venkanna
Follow us on

పదవి లేకపోవడంతో ఏమీ చేయలేకపోతున్నా.. సీఐల బదిలీల విషయంలో నా మాట చెల్లలేదు.. సీఐల ట్రాన్స్‌ఫర్స్‌ విషయంలో MLAల మాట నెగ్గింది.. ప్రస్తుతం నేను ఇతరులపై ఆధారపడ్డా.. అంటూ టీడీపీ నేత బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. మనస్సులో ఒక మాట.. బయట మరో మాట చెప్పే వ్యక్తిత్వం తనది కాదంటూ విజయవాడ పశ్చిమనియోజకవర్గం నేత బుద్ధా వెంకన్న పేర్కొన్నారు. ముక్కుసూటిగా మాట్లాడటమే తనకు తెలుసన్నారు. పోరాటం కాదు..పవర్‌ ఉన్న వారికే గౌరవం ఉంటుందని.. తానూ ఇప్పుడిప్పుడే గ్రహించానని ఆవేదన వ్యక్తం చేశారు బుద్ధా వెంకన్న..

ఎంపీ కేశినేని చిన్ని బర్త్‌డే వేడుకల్లో బుద్ధా వెంకన్న.. ఈ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలపై పోరాటం చేసిన తనకు ఎమ్మెల్యే టిక్కెట్‌ ఇవ్వలేదంటూ ఆవేదన వ్యక్తంచేశారు. తనపై 37 కేసులు ఉన్నాయని.. అయినా ఏ పదవి దక్కలేదన్నారు. పోరాటం చేసిన వారికి ఏ పోస్టులు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రస్తుతం మంత్రులు, ఎమ్మెల్యేలుగా ఉన్నవారు ఎంతమంది పోరాటం చేశారు?.. అంటూ ప్రశ్నించారు. 2029 ఎన్నికల్లో పోరాటం చేసి టికెట్‌ తెచ్చుకొని గెలుస్తా అంటూ ఆశాభావం వ్యక్తంచేశారు. 2024 ఎన్నికల్లో తనకు జ్ఞానోదయం అయ్యిందని.. తాను మాట్లాడింది..ఎంపీ చిన్ని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లాలి.. అంటూ బుద్ధా వెంకన్న వ్యాఖ్యానించారు.

వీడియో చూడండి..

కాగా.. బుద్ధా వెంకన్న ఆవేదనను టీడీపీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తానని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని హామీ ఇచ్చారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..